''మన ఇండస్ర్టీ మనుషులతో మా డైరక్టర్ శ్రీకాంత్ అడ్డాల ఎక్కువగా కలవడేమో.. అందుకే ఆయన ప్యూర్ హ్యుమన్ బీయింగ్. చాలా మంచోడు. ఆయన మనస్సు ఈ సినిమా. ఆయనంటే నాకు చాలా ఇష్టం. ఆయన సినిమాల్లో సీన్లు రియల్ లైఫ్ సిట్యుయేషన్లులా ఉంటాయి. సీతమ్మ వాకిట్లో సినిమాతో మనిషిగా ఎదిగాను.. ఇప్పుడు బ్రహ్మోత్సవంతో ఇంకా ఎదిగాను'' అన్నాడు మహేష్. ''బ్రహ్మోత్సవం'' ఆడియో ఫంక్షన్లో ఆయన చేసిన ఈ కామెంట్లు ఇప్పుడు కాస్త గట్టిగానే వినిపించే ఛాన్సుంది.
అసలు ఇండస్ర్టీ వారితో కలిసి తిరిగితే ఎందుకు పాడైపోతారు మహేష్ అని కొందరు ప్రశ్నిస్తున్నారు? తన తండ్రి కృష్ణ జీవితంలో చూసి ఒడిదుడుకులు కారణంగా మహేష్ చిన్నప్పుడే చాలా అనుభవాలు చవిచూసినట్లున్నాడు. అందుకే సదరు కామెంట్లు చేసుంటాడు. ఏదేమైనా మహేష్ ఓ మాటన్నాడంటే.. ఖచ్చితంగా అది ముక్కుసూటిగానే ఉంటుందిగా.
ఇంకా మాట్లాడుతూ.. ''ఫస్ట్ టైమ్ మా పాప సితార పాప వచ్చింది.. చాలా ఆనందంగా ఉంది'' అంటూ తన ప్రసంగం మొదలెట్టాడు మహేష్ బాబు. ఈ సినిమాను చేయడం ద్వారా.. రేవతి - తులసి - నరేష్ - సాయాజీ షిండే - సత్యరాజ్ గార్ల నుండి చాలా నేర్చుకున్నా అని చెప్పాడు. హీరోయిన్లు సమంత అండ్ కాజల్ తో ఇదివరకు హిట్లు కొట్టానని.. ఇప్పుడు ఇంకా పెద్ద హిట్టు కొడతా అన్నాడు. ''తోట తరణి గారు అర్జున్ సినిమా కోసం వేసిన మధుర మీనాక్షి సెట్ ఇంకా మర్చిపోలేను. ఫోన్ చేయగానే ఒప్పుకున్నందుకు రత్నవేలుకు థ్యాంక్స్'' అన్నాడు మహేష్.
ఇకపోతే నిర్మాత పివిపి ప్రతీ చిన్న విషయానికీ ఎక్సయిట్ అవుతుంటారని.. అలాంటి ప్యాషనేట్ ప్రొడ్యూసర్ తో పనిచేసినందుకు చాలా హ్యాపీ అన్నాడు సూపర్ స్టార్. ఫైనల్ గా మే 20న రిలీజ్ డేట్ అంటూ ప్రకటించి సెలవు తీసుకున్నాడు.