కొత్త ప్రచారం మొదలెట్టిన స్పైడర్

Update: 2017-06-06 06:50 GMT
మన దేశంలో ఇన్నేసి మిలియన్ల వ్యూస్ వచ్చాయి అంటూ యుట్యూబ్ రికార్డుల గురించి మొన్నటివరకు చాలా సినిమాలవారు హడావుడి చేసేశారు. ఇప్పుడు కొత్తగా స్పైడర్ వారు మాత్రం.. ఏకంగా ఫేస్ బుక్ వీడియోలకు వచ్చిన వ్యూస్ కూడా కలిపేసి.. డిజిటిల్ వ్యూస్ రికార్డు అంటూ రచ్చ చేస్తున్నారు. అంటే ఒక కొత్త పాయింట్ పట్టారనేగా చెప్పాలి. ఇప్పుడు మరో కొత్త పాయింట్ తో కూడా దూసుకొచ్చారండోయ్.

సాధారణంగా ఏదైనా కొత్తగా ఒక ట్రైలర్ కాని టీజర్ కాని వచ్చినప్పుడు.. దేశంలో ఎక్కువమంది దానినే చూస్తుంటే.. అది గూగుల్ లేదా యుట్యూబ్ ట్రెండింగ్ లిస్టులోకి వచ్చేస్తుంది. ఇకపోతే సిటీ వైడ్ గా కూడా ఏయే వీడియో ట్రెండ్ అవుతున్నాయో యుట్యూబ్ వంటి వీడియో షేరింగ్ వెబ్సైట్ లలో మనం చూడొచ్చు. అలా చూసుకుంటే.. ఇప్పుడు సింగపూర్. ఆస్ర్టేలియా వంటి దేశాల్లో కూడా 'స్పైడర్' టీజర్ టాప్ 5 లో ట్రెండింగ్ అవుతోంది. ముఖ్యంగా ఇదంతా మహేష్‌ బాబుపై అభిమానం లేదా తెలుగు ప్రజల ఉనికి ఆయా దేశాల్లో ఎక్కువగా ఉందని చెప్పొచ్చుకాని.. అంతకంటే ఎక్కువగా మురుగుదాస్ కు ఉన్న అశేష్‌ తమిళ అభిమానులు కూడా ఈ టీజర్ ను చాలా ఆసక్తిగా తిలకిస్తున్నారని అర్ధం చేసుకోవచ్చు.

అయితే ఇతర దేశాల్లో కూడా ట్రెండింగ్ అవుతోంది అనే న్యూస్ ను కూడా ఇప్పుడు ఒక రికార్డుగా మార్చేస్తూ.. దానిని కూడా ప్రచారం చేసేస్తున్నారు స్పైడర్ టీమ్. ఇక రేపటి రోజున మనం ఇతర సినిమాల టీజర్లు కూడా వేరే దేశాల టాప్ 5 లేదా టా 10 లిస్టులోకి రాగానే.. ఆ దేశంలో ట్రెండింగ్ ఈ దేశంలో ట్రెండింగ్ అంటూ కొత్త రికార్డుల గురించి వినేస్తామేమో!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News