మహేష్ బాబు హీరోగా ఏ.ఆర్.మురుగుదాస్ డైరక్షన్లో రూపొందుతున్న సినిమా ''స్పైడర్''. ఈ సినిమాలో మహేష్ ఒక వినూత్న క్యారక్టర్ చేస్తున్నాడని ఆల్రెడీ చాలాసార్లు చెప్పుకున్నాం. అయితే గతంలో తెలిసినట్లు.. ఈ సినిమా కోసం లండన్ లో చేసిన గ్రాఫిక్స్ హైలైట్ అవ్వనున్నాయని ఇప్పుడు టీజర్ చెప్పకనే చెబుతోంది.
టీజర్లోని SPY అనే అక్షరాలు చూస్తే.. ఇది ఒక గూడచారి కథ అని తెలిసిపోతోంది. అయితే మొత్తంగా SPYDER అని పెట్టడంతో.. డెఫినెట్ గా ఈ సినిమాలో స్పైడర్ అనే సాలీడు పెద్ద పాత్ర పోషిస్తుందని అనుకోవచ్చు. ఇప్పుడు టీజర్లో ఆ మెకానికల్ స్పైడర్ ను పరిచయం చేశాడు మురుగుదాస్. ట్రాన్స్ ఫార్మర్స్ సినిమాలో ఆటోబాట్స్ తరహాలో ఉన్న ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కలిగిన సాలీడు.. కంప్యూటర్ ముందు ఏదో పనిలో నిమగ్నమైన మహేష్ బూటుపై ఎక్కి.. అక్కడి నుండి పాకుతూ అతని భుజం మీదకు ఎక్కేసింది. ఇక ఆ భుజం మీద ఎక్కి అల్లరి చేస్తుండటంతో.. పక్కకు తిరిగి వెంటనే మహేష్ 'ఉష్' అనడంతో టీజర్ ఎండ్ అయ్యింది.
ఒక రకంగా చెప్పాలంటే.. తెలుగులో వస్తున్న తొలి ఒరిజినల్ సైన్స్ ఫిక్షన్ సినిమా అని చెప్పుకోవచ్చు. ఈ మధ్యన కథల ఎంపికలో నయా ట్రెండ్ తో ఇంప్రెస్ చేస్తున్న మహేష్ బాబు.. ఖచ్చితంగా ''స్పైడర్'' తో తన స్థాయినే కాదు తెలుగు సినిమా స్థాయిని కూడా బాగా పెంచేస్తాడని అనుకోవచ్చు.
Full View