ఊహించని విధంగా మన అభిమాన హీరో ఒక్కసారి మనల్ని కలిసి ఒక్క చిరునవ్వుతో పలకరిస్తే ఆ ఆనందం ఎలా ఉంటుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అలాగే మనకు సంబంధించిన విషయం గురించి స్టార్ హీరో ఒక్క నిమిషం ఆలోచించినా ఆనందానికి అవదులు ఉండవు. మన సంతోషంలో కొంచెమైనా బాగమైతే ఇక మాటల్లో చెప్పడానికి వీలు పడదు. అలాగే ఎంతో ఇష్టమైన మహేష్ బాబు పెళ్లికి శుభాకాంక్షలు అని ఒక లెటర్ పంపితే ఆ అభిమాని సంతోషం ఏ విధంగా ఉంటుంది?
ఎంతగానో ఇష్టపడే హీరోల నుంచి అభిమానులు కోరుకునేది తిరిగి ఒక ప్రేమను పొందడమే. సూపర్ స్టార్ కి అది బాగా అర్థమైనట్టుంది. అందుకే స్పెషల్ గా సైన్ చేసి సులేక అనే హైదరాబాద్ అభిమాని పెళ్లికి శుభాకాంక్షలు అని ఒక గ్రీటింగ్ కార్డ్ ని పంపారు. అందులో మహేష్ తో పాటు నమ్రత కూడా వదువరులకు గ్రీటింగ్స్ తెలిపినట్లు ఉంది. అసలు అది మహేష్ నుంచి వస్తున్నట్లు పెళ్లి జంటకు ముందు తెలియదట. సులేఖ కుటుంబ సభ్యులు పర్సనల్ గా ఆమెకు తెలియకుండా మహేష్ బాబుకి వెడ్డింగ్ ఇన్విటేషన్ పంపారు.
అది కూడా మహేశ్ కు ఇష్టమైన గేమ్ ఆఫ్ త్రోన్స్ టీవీ సిరిస్ తరహాలో రెడీ చేసి పంపారు. ఆ టివి సిరీస్ లో "వింటర్ ఈజ్ కమింగ్" అనే వర్డ్ చాలా ఫెమాస్. అలాగే "వెడ్డింగ్ ఈజ్ కమింగ్" అంటూ సులేక పేరెంట్స్ మహేష్ కుటుంబానికి లేక పంపడంతో మహేష్ గ్రీటింగ్స్ కార్డ్ ద్వారా వారికి థ్రిల్ ఇవ్వడం స్పెషల్ అని చెప్పాలి. గతంలో హీరో కృష్ణ కూడా తన అభిమానులు రాసిన లేఖలకు తిరిగి కృతజ్ఞతలతో ప్రత్యుత్తరం పంపేవారు. అదే తరహాలో మహేష్ కూడా ఫాలో అవ్వడం గ్రేట్ అని చెప్పాలి.