మహేష్ ఐపీయ‌ల్ టీమ్ కొంటున్నాడా?

Update: 2015-07-11 23:14 GMT
సూప‌ర్‌స్టార్ డ‌మ్ సంపాదించుకొన్న మ‌హేష్ ఇప్ప‌టివ‌ర‌కు సినిమాలు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల‌కే ప‌రిమితమ‌య్యాడు. ఇత‌ర‌త్రా వ్యాపారాల‌పై ఆయ‌న అంత కాన్సంట్ర‌ట్ చేయ‌లేదు. ఇటీవ‌లే సొంతంగా ఓ నిర్మాణ సంస్థని ప్రారంభించాడు. ఆ సంస్థ‌లో వ‌రుస‌గా సినిమాలు తీయాల‌ని ప్లాన్ చేసుకొంటున్నాడు. దాంతోపాటు తాజాగా మ‌రో కొత్త బిజినెస్ ప్లాన్‌కి కూడా మ‌హేష్ తెర‌తీశాడ‌ని తెలుస్తోంది. దేశ‌వ్యాప్తంగా మంచి గుర్తింపుని సొంతం చేసుకొన్న మ‌హేష్‌బాబు  క్రీడా రంగంలోకి అడుగు పెడుతున్న‌ట్టు స‌మాచారం. ఆయ‌న ఐపీయ‌ల్‌లో ఓ కొత్త టీమ్‌ని ప్ర‌వేశ పెట్ట‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. వైజాగ్ సిక్స‌ర్స్  పేరుతో 2017లో మ‌హేష్ టీమ్ ఐపీయ‌ల్‌లోకి అడుగుపెడుతున్న‌ట్టు స‌మాచారం.

ఈ టీమ్ ఆలోచ‌న వెన‌క మ‌హేష్ బావ, ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త‌, గుంటూరు ఎంపీ జ‌య‌దేవ్ గ‌ల్లా ఉన్న‌ట్టు తెలిసింది. టీమ్ అస‌లు ఓన‌ర్ జ‌య‌దేవ్ గల్లానేన‌ట‌. కానీ ఆ  టీమ్‌కి ప్ర‌చార క‌ర్త‌గా మ‌హేష్ వ్య‌వ‌హ‌రించ‌బోతున్నారట‌. టీమ్‌కోసం మ‌హేష్ కూడా కొంత భాగం ఇన్వెస్ట్ చేయ‌బోతున్నాడ‌ని ఫిల్మ్ న‌గ‌ర్ జ‌నాలు చెబుతున్నారు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం ఉన్న‌ప్పుడు హైద‌రాబాద్ త‌ర‌ఫున స‌న్‌రైజ‌ర్స్ జ‌ట్టు ఉండేది. ఆ జ‌ట్టు ఇప్ప‌టికీ కొన‌సాగుతోంది. అయితే రాష్ట్రం విడిపోయింది కాబ‌ట్టి... హైద‌రాబాద్ స‌న్‌రైజ‌ర్స్ అంటే తెలంగాణ‌కే చెందుతుంద‌నీ, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి కూడా ఓ టీమ్ ఉంటే బాగుంటుంద‌న్న ఆలోచ‌నే `వైజాగ్ సిక్స‌ర్` టీమ్ ఏర్పాటుకి కార‌ణ‌మైన‌ట్టు తెలుస్తోంది. మొత్త‌మ్మీద మ‌హేష్ క్రికెట్‌తోనూ అనుబంధం పెంచుకొంటున్నార‌న్న‌మాట‌. ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ ప్లేయ‌ర్స్‌తో క‌లిసి ఆయ‌న  ప‌లు ప్ర‌క‌ట‌న‌ల్లో న‌టించి అద‌ర‌గొట్టేస్తాడ‌న్న‌మాట‌.
Tags:    

Similar News