ఈ నెల 27న జరగనున్న మాజీ రాష్ట్రపతి - దివంగత అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా `ఇగ్ నైటింగ్ మైండ్స్` అనే స్వచ్ఛంద సంస్థ `గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ` కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. ఆ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం ...`హరిత హారం`ద్వారా మద్దతు తెలుపుతూ....పలువురు సెలబ్రిటీలకు `గ్రీన్ ఇండియా చాలెంజ్ `విసురుతోంది. ఈ నేపథ్యంలోనే నిజామాబాద్ ఎంపీ కవిత సినీ దర్శకుడు రాజమౌళికి కవిత `గ్రీన్ ఇండియా ఛాలెంజ్` విసిరారు. ఆ ఛాలెంజ్ ను స్వీకరించిన రాజమౌళి....తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కు చాలెంజ్ విసిరారు. ఆ చాలెంజ్ కు స్పందించిన కేటీఆర్....తాజాగా ట్వీట్ చేశారు. తాను మొక్క నాటుతోన్న ఫొటోను కేటీఆర్ ట్వీట్ చేశారు. దాంతోపాటు, టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుకు కేటీఆర్ `గ్రీన్ ఇండియా చాలెంజ్ `విసిరారు.
జక్కన్న తనకు విసిరిన `గ్రీన్ ఇండియా చాలెంజ్ `ను కేటీఆర్ పూర్తి చేశారు. తాను మొక్కలు నాటుతున్న ఫొటోలను ట్వీట్ చేశారు. రోజ్ ఉడ్ - గోల్డెన్ చంపా మొక్కలను నాటిన కేటీఆర్...ఆ ఫొటోలను ట్వీట్ చేశారు. దాంతోపాటు - మహేష్ బాబు - సచిన్ టెండూల్కర్ - వీవీఎస్ లక్ష్మణ్ - రాజ్ దీప్ సర్ దేశాయ్ లకు కేటీఆర్ `గ్రీన్ ఇండియా చాలెంజ్ ` విసిరారు. అంతేకాదు, ఆ నలుగురూ....కనీసం మూడు మొక్కలు నాటాలని కోరారు. ఐస్ బకెట్ చాలెంజ్ తరహాలోనే ఈ `గ్రీన్ ఇండియా చాలెంజ్ ` కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.