మ‌హేష్ తో ష్రాఫ్ బోయ్.. ఈ డీల్ రేంజ్ ఎంత‌?

Update: 2021-09-05 05:30 GMT
ద‌క్షిణాదిన సూప‌ర్ స్టార్ మ‌హేష్ క్రేజ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఉత్త‌రాదినా ఫాలోయింగ్ ఉన్న ఛ‌రిష్మాటిక్ హీరో అత‌డు. ఇత‌ర‌ భాష‌ల నుంచి సూప‌ర్ స్టార్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే దేశ వ్యాప్తంగా ప‌బ్లిసిటీ కోసం కార్పోరేట్ కంపెనీలు  సూప‌ర్ స్టార్ నే  త‌మ సంస్థ‌ల‌కు ప్ర‌చార‌క‌ర్త‌గా  నియమించుకో వ‌డానికి అమితాస‌క్తిని చూపిస్తాయి. ఆ ర‌కంగా మ‌హేష్ దేశంలోనే అత్య‌ధిక బ్రాండ్ ఎండార్స్ మెంట్స్ కి ప్ర‌మోట‌ర్ గా వెలిగిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే మ‌హేష్  బాలీవుడ్ స్టార్ హీరో ర‌ణ‌వీర్ సింగ్ తో క‌లిసి ఓ ప్ర‌ముఖ బేవ‌రేజెస్  సంస్థ వాణిజ్య ప్ర‌క‌ట‌న‌కు ప‌నిచేసారు. దీంతో ఆ ప్ర‌క‌ట‌న‌కు మంచి ఆద‌ర‌ణ ల‌భించింది.

తాజాగా  సూప‌ర్ స్టార్  మ‌రో బాలీవుడ్ న‌టుడు టైగ‌ర్ ష్రాఫ్ తో క‌లిసి ఓ మౌత్ ఫ్రెష్ ఉత్ప‌త్తి ప్ర‌క‌ట‌న‌ కోసం ప‌నిచేసారు. ఇప్ప‌టికే ఈ యాడ్ షూట్ పూర్త‌యింది. దీనికి సంబంధించిన యాడ్ ప్రోమో కూడా ఇన్ స్టాలో వైర‌ల్ అవుతోంది. అందులో మ‌హేష్..టైగ‌ర్ ష్రాప్ త‌న‌దైన గెట‌ప్స్ ఎన‌ర్జీతో ఆక‌ట్టుకుంటున్నారు. మ‌రి ఈ ప్ర‌క‌ట‌న‌లో న‌టించేందుకు మ‌హేష్‌ ఎన్ని కోట్లు ఛార్జ్ చేసారు? అన్న వివ‌రాలు ఇంకా బ‌య‌ట‌కు రాలేదు. తెలుగు న‌టులలో వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల్లో మ‌హేష్ ది అగ్ర స్థాన‌మ‌నే చెప్పాలి. అగ్ర‌గామి సంస్థ‌ల‌న్ని మహేష్ తోనే త‌మ ప్రోడ‌క్ట్ ని ప్ర‌చారం చేయించుకోవాల‌ని ముందుకొస్తుంటాయి. అందుకుగాను స‌ద‌రు సంస్థ‌లు  భారీ మొత్తాన్ని చెల్లిస్తుంటాయి.

మ‌హేష్ సినిమాల్ని మించి బ్రాండ్ ప్ర‌మోట‌ర్ గానే ఎక్కువ‌గా ఆర్జిస్తున్నార‌ని కొన్ని నివేదిక‌లు సైతం గ‌తంలో వెలువ‌డ్డాయి. మ‌రి అత‌డి క్రేజ్ ఇప్పుడు మూడింత‌లు అయింది. ఈ నేప‌థ్యంలో కొత్త ప్ర‌క‌ట‌న‌ల కోసం భారీగానే పారితోషికం పెంచి ఉంటార‌ని భావిస్తున్నారు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. ప్ర‌స్తుతం మ‌హేష్-  ప‌రుశురాం ద‌ర్శ‌క‌త్వంలో `స‌ర్కారు వారి పాట‌లో` న‌టిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా వ‌చ్చే ఏడాది విడుద‌ల కానుంది. ఈ సినిమా త‌ర్వాత త్రివిక్ర‌మ్.. రాజ‌మౌళిల‌తో వ‌రుస‌గా సినిమాల చేయ‌నున్నారు. అలాగే `అర్జున్ రెడ్డి` ఫేం సందీప్ వంగ కూడా లైన్లో  ఉన్నారు.

బ్రాండ్ ని బ‌ట్టి మ‌హేష్ పారితోషికం..

సెల‌బ్రిటీల‌కు క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్ రెవెన్యూ అద‌న‌పు భ‌రోసా అన్న సంగ‌తి తెలిసిందే. సినిమాల్లో అంతో ఇంతో పేరుంటే చాలు వారితో యాడ్ ఏజెన్సీలు.. ప్ర‌ముఖ బ్రాండింగ్ కంపెనీలు ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. భారీ గా డీల్స్ కుదుర్చుకుని పారితోషికాలు అంద‌జేస్తున్నాయి. క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్ బిజినెస్ లాభ‌సాటిగా వుండ‌టంతో చిన్న హీరోల‌ నుంచి టాప్ రేంజ్ లో వున్న హీరోల వ‌ర‌కు భారీగా డిమాండ్ చేస్తున్నారు. చిన్న హీరోలే ఓ  రేంజ్ లో రెమ్యున‌రేష‌న్ డిమాండ్ చేస్తుంటే స్టార్ హీరోల గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు.

సూప‌ర్ స్టార్ మ‌హేష్ ప్ర‌క‌ట‌న‌ల ఆదాయంలో ఎప్పుడూ ముందు వ‌రుస‌లో వున్నారు. ఈ మ‌ధ్య వ‌రుస విజ‌యాల్ని ద‌క్కించుకుంటూ దూసుకుపోతున్న ఆయ‌న క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్ విష‌యంలో టాలీవుడ్ హీరోల్లో టాప్ వ‌న్ పొజీష‌న్ లో వున్నారు. ఓ ర‌కంగా చెప్పాలంటే బాలీవుడ్ హీరోల‌తో బ్రాండ్ ల విష‌యంలో పోటీప‌డుతున్నారు. సినిమాల‌తో పాటు క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్ రూపంలో మ‌హేష్ భారీగానే అందుకుంటున్నారు. క‌మ‌ర్షియ‌ల్ యాడ్ కి మ‌హేష్ అందుకుంటున్న పారితోషికం ఎంతో సుమారు రూ. 5 నుంచి 10 కోట్లు ఉంటుంద‌ని స‌మాచారం.

థ‌మ్స‌ప్... సంతూర్‌... బైజూస్... డెన్వ‌ర్ వంటి బ్రాండ్ ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్ ‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న మ‌హేష్ ఏడాదికి గానూ దాదాపు 5 నుంచి 10 కోట్లు తీసుకుంటున్న‌ట్టు తెలిసింది. ఈ మ‌ధ్య ఈ కామ‌ర్స్ దిగ్గ‌జం ఫ్లిప్ కార్ట్ కి బ్రాండింగ్ చేస్తున్నారు. దీనికి కూడా మ‌హేష్ భారీగానే డిమాండ్ చేస్తున్నార‌ట‌. ఇప్పుడు బ్రూవ‌రీస్ కోలా యాడ్ల‌కు అంత‌కుమించి వ‌సూలు చేస్తున్నార‌ట‌. స్టార్ గా ఓ వెలుగు వెలుగుతున్న‌ప్పుడే అందినంత దండుకోవాలంటారు.  దీపం వుండ‌గానే ఇల్లు చ‌క్క‌బెట్టుకోవ‌డం ఎలానో మ‌హేష్ నే అడ‌గాలి.
Tags:    

Similar News