సూపర్ స్టార్ మహేష్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో క్షణం తీరిక లేనంత బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. `స్పైడర్` సినిమాతో మొదలైన టెన్షన్ ఇప్పటివరకూ తీరనేలేదు. కొరటాలతో శ్రీమంతుడు- భరత్ అనే నేను లాంటి బ్లాక్ బస్టర్లలో నటించినా మహేష్ కసి తీరలేదు. స్పైడర్ టైమ్ లో తాను ఎంత టెన్షన్ పడ్డాడో అదంతా `భరత్ అనే నేను` సక్సెస్ తో తీరిపోయింది అనుకుంటుండగానే... అతడు వెంటనే `మహర్షి` లాంటి క్లాసిక్ హిట్ కోసం ఎంతో తపించాడు. బ్యాక్ టు బ్యాక్ హిట్లు ఇచ్చి అభిమానుల్ని సంతుష్టుల్ని చేయాలన్న తపన మహేష్ లో కనిపించింది. అందుకే ఏమాత్రం గ్యాప్ లేకుండా వరుసగా అరడజను సినిమాలు చేసుకుంటూనే పోతున్నాడు.
ప్రస్తుతం అనీల్ రావిపూడి దర్శకత్వంలో `సరిలేరు నీకెవ్వరు` చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా సగభాగం ఇప్పటికే పూర్తయింది. రావిపూడి వేగంగా చిత్రీకరణను పూర్తి చేస్తున్నారు. అయితే గ్యాప్ లెస్ గా ఇలా షూటింగులు చేస్తుండడంతో మహేష్ లో ఏదో తెలియని అలసట కనిపిస్తోందట. సినిమాల షూట్ గ్యాపుల్లో వారం రెండు వారాల పాటు విదేశాలు వెళ్లి వచ్చినా అది సరిపోవడం లేదు. ఫ్యామిలీకి రిలీఫ్ ట్రిప్ లు అయినా వర్కింగ్ పర్సన్ గా తన అలసట తీరేందుకు ఆ చిన్న విరామం సరిపోవడం లేదు. అందుకే ఈసారి సుదీర్ఘమైన గ్యాప్ తీసుకోవాలని మహేష్ భావిస్తున్నారట.
సరిలేరు నీకెవ్వరు షూటింగ్ పూర్తవ్వగానే మహేష్ మూడు నెలల పాటు సుదీర్ఘ విరామం తీసుకుంటారని తెలుస్తోంది. ఆ తర్వాతనే మరో కొత్త సినిమాని ప్రారంభిస్తారు. అంటే అప్పటివరకూ అతడి క్యూలో ఉన్న వంశీ పైడి పల్లి కానీ.. ఇతర దర్శకులు కానీ వేచి చూడాల్సి ఉంటుంది. మహేష్ నటిస్తున్న 26వ సినిమా పూర్తవ్వగానే 27వ సినిమాకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తారని ఇప్పటికే ఊహాగానాలు ఉన్నాయి. ప్రస్తుతం మహేష్ కోసం వంశీ స్క్రిప్టును రెడీ చేస్తున్నారు. అలాగే ఎస్.ఎస్.రాజమౌళి సహా పలువురు దర్శకులు మహేష్ కోసం కథల్ని రెడీ చేసే పనిలో ఉన్నారు. మరి మూడు నెలల గ్యాప్ తో వీటన్నిటికీ ఇబ్బందే మరి. మహేష్ నిర్ణయం ఎలా ఉంటుంది? అన్నది చూడాలి. దూకుడున్నవాడు అంత గ్యాప్ తీసుకుంటే అభిమానులు కూడా ఆగలేరేమో