ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం 'మహర్షి' ఫైనల్ గా రిలీజ్ అయింది. డీసెంట్ టాక్ తో బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతున్న ఈ సినిమాలో మహేష్ నాగలి భుజంపై పట్టి పొలంలో నడుస్తున్న రైతన్న అవతారం అందరినీ ఆకర్షిస్తోంది. సినిమా పోస్టర్లలో కూడా ఈ నాగలి పట్టుకున్న పోస్టర్ ప్రత్యేకంగానిలిచింది. అయితే మహేష్ ఇలా నాగలి పట్టుకొని రైతన్న పాత్రలో కనిపించడం మొదటిసారేమీ కాదు. చిన్నప్పుడే అలాంటి పాత్రలో నటించి అందరినీ మెప్పించాడు.
మహేష్ టీనేజ్ లో ఉన్నప్పుడు డజనుకు పైగా చిత్రాలలో నటించిన విషయం తెలిసిందే. ఇప్పట్లో మహేష్ స్లిమ్ గా ఉన్నాడు కానీ అప్పట్లో మహేష్ కాస్త బొద్దుగా ఉండేవాడు. అప్పట్లో మహేష్ నాగలి భుజంపై పెట్టుకొని.. మెడలో ఒక కండువాతో ఉన్న ఒక స్టిల్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. అభిమానులతే అప్పటి మహేష్ ఫోటోను ఇప్పటి మహేష్ ఫోటోను పోల్చి చూసుకొని ఎంత క్యూట్ గా ఉన్నాడో అని మురిసిపోతున్నారు.
ఇదిలా ఉంటే 'మహర్షి' సినిమాలో చూపించిన వీకెండ్ ఫార్మింగ్ కాన్సెప్ట్ అర్బన్ యూత్ కు తెగ కనెక్ట్ అవుతోంది. చాలామంది రైతు కుటుంబాల నుంచి వచ్చినవారు తమ పొలంలో పనులు చేస్తూ 'మహర్షి' తమకు ప్రేరణనిచ్చిందని చెప్తూ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కొందరైతే.. ఈ సినిమా చూసిన తర్వాత తమకు రైతులపై గౌరవం పెరిగిందని కూడా పోస్టులు పెడుతున్నారు. సినిమాలో ఉన్న సందేశం ప్రేక్షకులకు కనెక్ట్ అయితే ఫిలిం మేకర్స్ కు సంతోషమే కదా?