సూపర్ స్టార్ మహేష్ స్టార్ డమ్ గురించి - ఆయన నటించే సినిమాల గురించి మాట్లాడినంతగా - తనలోని సేవాగుణం చర్చకు రాలేదన్నది వాస్తవం. అయితే అందుకు కారణం లేకపోలేదు. మహేష్ తాను ఏదైనా సామాజిక కార్యక్రమం చేపడితే దానికి అనవసర ప్రచారం ఎందుకులే అనుకునే తరహా. చాలా సందర్భాల్లో కష్టాల్లో ఉన్నవారికి ఆర్థిక సాయం చేశారు. అనారోగ్యంతో ఉన్న బాలలకు ఆస్పత్రి బిల్స్ పే చేశాడు. కానీ అవేవీ ఎవరికీ తెలీదు. ఇలాంటి వాటికి ప్రచారం చేసుకోవడం తనకు ఇష్టం ఉండదని చెబుతారు. ముఖ్యంగా చిన్నారుల ఆరోగ్యం కోసం ఓ ఎన్జీవోని రన్ చేయాలనేది మహేష్ కి ఎప్పటినుంచో ఉన్న పట్టుదల. కానీ అది రకరకాల కారణాలతో వాయిదా పడుతూనే ఉంది.
దేనికైనా టైమ్ రావాలని అంటారు. ఇప్పుడు మహేష్ కి కూడా టైమ్ వచ్చింది. ఇకపై చిన్నారుల సంక్షేమం కోసం ఓ ఎన్జీవో ఆర్గనైజేషన్ ని ప్రారంభించాలని సీరియస్ గా నిర్ణయించుకున్నాడని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం మహేష్ షూటింగులతో బిజీగా ఉండడంతో ఆ పనులన్నీ నమ్రత స్వయంగా పర్యవేక్షిస్తున్నారట. ఈ ఆర్గనైజేషన్ ద్వారా నిధిని సేకరించి చిన్నారుల ఆరోగ్యం కోసం ఖర్చు చేయాలన్నది మహేష్ -నమ్రత దంపతుల ఆలోచన.
ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం పిల్లలు అంటే తమకు ఉన్న ఆపేక్ష. మహేష్ కి ఏమాత్రం సమయం చిక్కినా మాష్టర్ గౌతమ్ - బేబి సితారలతో కలిసి టైమ్ స్పెండ్ చేస్తాడు. వారితో కలిసి సరదాగా ఆడుకునేందుకు ప్రిపేర్డ్ గా ఉంటాడు. మొన్ననే గౌతమ్ తో ఫైటింగ్ చేసిన ఫోటోలు బయటికి వచ్చిన సంగతి తెలిసిందే. బాలల్ని ప్రేమించడం తన మోటో. మన చుట్టూ బాహ్య ప్రపంచంలో ఎందరో చిన్నారులు ఆర్థిక సమస్యల వల్ల సరైన ఆహారం తీసుకోలేక - అనారోగ్యం పాలయ్యే పరిస్థితి. అలాంటి వారికి సాయం చేయాలన్నదే మహేష్ ధృఢ సంకల్పం అని దీనిని బట్టి అర్థమవుతోంది.