బావకి బావగారు కంగ్రాట్స్‌ చెప్పారు

Update: 2015-12-27 06:10 GMT
మహేష్‌ బావ పొగిడేస్తే ఆ పొగడ్తలో ఉండే కిక్కే వేరు. ప్రస్తుతం ఆ కిక్కునే ఆస్వాధిస్తున్నాడు సుధీర్‌బాబు. ఈ యంగ్‌ హీరో ప్రిన్స్‌ మహేష్‌కి స్వయానా బావగారు అన్న సంగతి తెలిసిందే. ఈ శుక్రవారం రిలీజైన భలే మంచి రోజు ఘనవిజయం సాధించిన సందర్భంగా సెలబ్రేషన్స్‌ చేసుకుంటున్నాడు సుధీర్‌.

ఫైర్‌ యాడెడ్‌ టు ది పెట్రోల్‌ అన్న చందంగా ఈ సెలబ్రేషన్స్‌ మూడ్‌ లో ఉండగానే బావగారు మహేష్‌ నుంచి ఓ ప్రశంసా పూర్వక ట్వీట్‌ వచ్చింది. కాంగ్రాట్స్‌ సుధీర్‌. భలే మంచి రోజు చిత్రానికి మంచి రివ్యూలే వచ్చాయని చదివాను. విజయం అందుకున్నందుకు శుభాకాంక్షలు. నేను ఇలా హైదరాబాద్‌ లో అడుగుపెట్టగానే నీ సినిమా వెంటనే చూసేస్తాను అంటూ మహేష్‌ ట్వీటారు.

సుధీర్‌ బాబుకి ఇటీవలి కాలంలో సక్సెస్‌ అందని మావి అయ్యింది. మారుతి దర్శకత్వంలోని ప్రేమకథాచిత్రమ్‌ తర్వాత ఒక్క హిట్టు కూడా లేదు. పూర్తిగా డీలా పడిపోయిన టైమ్‌ లో చక్కని విజయం దక్కింది. భలే మంచి రోజు ఓ డిఫరెంట్‌ మూవీ అన్న టాక్‌ వచ్చింది. స్వామిరారా తర్వాత మళ్లీ అలాంటి ప్రయోగాత్మక చిత్రమిది. చక్కని కామెడీ మూవీగా ఆకట్టుకుంటోందని విమర్శకులు ప్రశంసించారు. అందుకే ఈ రివ్యూలు ఆన్‌ లైన్‌ లో చదివేసిన మహేష్‌ బావ ఇలా సుధీర్‌ బావని పొగిడేశాడు. కంగ్రాట్స్‌ చెప్పి ఖుషీ చేశాడు. అన్నట్టు అసలు మహేష్‌ బావగారు ఎక్కడున్నారో మాత్రం చెప్పలేదు. ఈ క్రిస్మస్‌ సందర్భంగా దుబాయ్‌ లోని ఖలీఫా బూర్జ్‌ సమీపంలో సెలబ్రేషన్స్‌ చేసుకున్న ఫోటోని ప్రిన్స్‌ ట్విట్టర్‌ లో పెట్టారు. ఆకాశంలో మబ్బుల మాటున దాక్కున్న ఖలీఫా బూర్జ్‌ ముందు గౌతమ్‌ దిగిన ఫోటోని ట్విట్టర్‌ లో పెట్టి క్లూ ఇచ్చారు ప్రిన్స్‌. వాటే లవ్‌ లీ ఫ్యామిలీ ట్రిప్‌ గురూ?
Tags:    

Similar News