ఆ ఇద్దరూ అన్నదమ్ములా? తండ్రీ కొడుకులా? అసలేమవుతారో చెప్పుకోండి చూద్దాం... ఇన్ స్టా ఫోటో చూశాక అభిమానుల ఫజిల్ ఇదీ. ఇంతకీ మీరేమని అంటారు?
అసలే వెనక్కి తిరిగి ఉన్నారు. షికార్ కెళుతూ కెమెరా కంటికి చిక్కారిలా. దీంతో ఆ ఇద్దరి మధ్యా డిఫరెన్స్ పెద్దగా కనిపించడం లేదు. ఇంతకీ ఎవరా ఇద్దరు? అంటే.. మహేష్ ఆయన కుమారుడు గౌతమ్. చూస్తుంటే అన్నదమ్ముల్లానే కనిపిస్తున్నారు.
ఇటీవల మహేష్ కాలేజ్ కుర్రాడిగా మారిపోయి మేకోవర్ పరంగా అందరికీ షాకిస్తున్నారు. తనయుడు గౌతమ్ పక్కనే నిలబడితే బ్రదర్స్ అనుకుని తడబడుతున్నారు అభిమానులు. మహేష్ ఇలా గిరజాల జుత్తుతో మాసీగా కనిపిస్తున్నారు. ఈ లుక్ పరశురామ్ తో `సర్కార్ వారి పాట` సినిమా కోసమేనని వేరే చెప్పాల్సిన పనే లేదు. జనవరి నుంచి సెట్స్ పైకి వెళ్లనున్నారు. ఈలోగానే ఖాళీ సమయాల్ని కథలు వింటూ సద్వినియోగం చేస్తున్నారు. కుటుంబ సభ్యులతో మహేష్ టైమ్ స్పెండ్ చేసే అరుదైన అవకాశాల్ని అస్సలు ఎప్పుడూ విడువరు.