సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త సినిమా సరిలేరు నీకెవ్వరు వచ్చే నెల మొదటివారం నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టుకోనుంది. ఎఫ్2 లాంటి వన్ అండ్ ఓన్లీ ఇండస్ట్రీ హిట్ అఫ్ ది ఇయర్ సాధించిన అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తుండటంతో అంచనాలు మాములుగా లేవు. దానికి తోడు ఎన్నో ఏళ్ళ తర్వాత విజయశాంతి రీ ఎంట్రీ ఇవ్వడం మరో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. అయితే హీరోయిన్ రష్మిక మందన్న విషయంలోనే ఫ్యాన్స్ ఏమంత సంతృప్తిగా లేరనే కామెంట్స్ సోషల్ మీడియాలో బలంగానే వినిపిస్తున్నాయి.
కారణం లేకపోలేదు. మహేష్ ది మగాళ్లే ఈర్ష్య పడే అందం. అలాంటిది తన పక్కన జోడి అంటే ఆషామాషీగా ఉంటే సరిపోదు. అందులోనూ బాలీవుడ్ రేంజ్ ఫిగర్లు అయితే తప్ప తనకు సూట్ అవ్వరు. అందుకే మొదటి సినిమా రాజకుమారుడు కోసం దర్శకుడు రాఘవేంద్ర రావు అప్పటికే డిమాండ్ లో ఉన్న ప్రీతీ జింతాను ఏరికోరి తీసుకొచ్చారు. మహేష్ తో అప్పటి నుంచి మొన్న భరత్ అనే నేను దాకా చేసిన హీరోయిన్లందరూ గ్లామర్ ని సెల్లింగ్ పాయింట్ గా పెట్టుకున్న వాళ్ళే. టక్కరి దొంగలో లీసారే-బిపాసా బసు 1 నేనొక్కడినేలో కృతి సనన్ లాంటివాళ్ళు నార్త్ నుంచి దిగుమతి చేసుకున్న వాళ్లే.
వాళ్ళను వదిలేసి ఆర్తి అగర్వాల్ - భూమిక - అనుష్క - సమంతా- కాజల్ ఇలా ఎవరిని చూసుకున్నా అందంలో ఒకరికొకరు పోటీ పడే బ్యూటీస్. కానీ రష్మిక మందన్న ఎంత మంచి ఆర్టిస్ట్ అయినప్పటికీ మహేష్ తో సరితూగే గ్లామర్ లేదేమో అన్నది అభిమానుల అభిప్రాయంగా కనిపిస్తోంది. గతంలో ఇదే ప్రాజెక్ట్ కు సాయి పల్లవి పేరు వినిపించినప్పుడు ఇవే రియాక్షన్లు వచ్చాయి. స్పైడర్ లో కాస్త మేకప్ తగ్గినందుకే రకుల్ లాంటి బ్యూటీ మహేష్ ముందు తేలిపోయింది. అలాంటిది లుక్స్ పరంగా మహేష్ పరంగా రష్మిక ఎంతవరకు సెట్ అవుతుందనేదే అసలు చిక్కు. మార్చే ఛాన్స్ లేదు కానీ ఈ ఇద్దరు జోడిగా ఉన్న లుక్స్ బయటికి వస్తే అప్పుడు క్లారిటీ వస్తుంది .