డిస్ట్రిబ్యూషన్ సంస్థగా ఉన్న మైత్రి మూవీస్ వారు మహేష్ బాబు ప్రోత్సాహంతో సినీ నిర్మాణ సంస్థగా మారిన విషయం తెల్సిందే. మొదటి మూడు సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో ఒక్కసారిగా మైత్రి పేరు మారుమ్రోగింది. వరుసగా చిన్నా పెద్దా అనే తేడా లేకుండా సినిమాలను నిర్మించిన మైత్రి వారు అప్పుడే కష్టాల్లో కూరుకున్నట్లుగా టాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. సవ్యసాచి మరియు అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రాల వల్ల మైత్రి మూవీస్ బ్యానర్ కు భారీగా నష్టాలు వచ్చాయి. ఆ రెండు సినిమాలు మాత్రమే కాకుండా మరికొన్ని సినిమాలపై కూడా వీరు పెట్టిన పెట్టుబడి రాలేదట. దాంతో మహేష్ బాబుతో నిర్మించాల్సిన సినిమాను వీరు వదలుకున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.
మహేష్ బాబు 26వ చిత్రాన్ని సుకుమార్ దర్శకత్వంలో నిర్మించబోతున్నట్లుగా ఎన్నో రోజుల క్రితం ప్రకటించిన మైత్రి వారు ఇప్పుడు ఉన్నట్లుండి భారీ బడ్జెట్ తో సినిమా తమ వల్ల కాదని సుకుమార్ తో చెప్పడంతో ఆయన మహేష్ ను మరింత సమయం అడిగాడని, ఆ గ్యాప్ లో అనీల్ రావిపూడితో సినిమాను చేసేందుకు మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటూ ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం మైత్రి వారు మూడు చిన్న సినిమాలను నిర్మిస్తున్నారు. ఆ చిత్రాలకు పెట్టుబడి పెట్టడంతో ప్రస్తుతం మైత్రి వారు ఆర్థికంగా అంతగా లేరని, ఇలాంటి సమయంలో మహేష్ బాబుతో మూవీ అంటే మామూలు విషయం కాదని మైత్రి వారు భావించారట. అందుకే సినిమాను క్యాన్సిల్ చేసినట్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
స్టార్ హీరో డేట్లు ఉంటే ఏ నిర్మాత కూడా ఆర్థిక విషయాలను పట్టించుకోడు. ఎందుకంటే మహేష్ బాబుతో మూవీ అంటే ప్రతి ఒక్క ఫైనాన్షియర్ కూడా ఖచ్చితంగా ఆర్థిక సాయంకు ముందుకు వస్తారు. కాని మైత్రి వారు ఫైనాన్షియర్స్ వద్ద తీసుకుని సినిమాను నిర్మించాలని భావించడం లేదేమో. అందుకే సినిమాను తాత్కాలికంగా పక్కకు పెట్టేశారేమో. ప్రస్తుతం నిర్మించిన మూడు సినిమాలు మైత్రి వారికి లాభాలు తెస్తే అప్పుడు మళ్లీ స్టార్ హీరోలతో సినిమాలకు సిద్దమయ్యే అవకాశం ఉంది.