సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో 25వ చిత్రంగా వచ్చిన ''మహర్షి'' సూపర్ హిట్ అవడమే కాకుండా పలు అవార్డులను కూడా అందుకుంది. వ్యవసాయం ప్రాధాన్యతను తెలియజెప్పేలా వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ఈ చిత్రంలో అప్పటికి మహేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక నిన్న కేంద్రం ప్రకటించిన జాతీయ చలన చిత్ర అవార్డులలో రెండు విభాగాల్లో ఎంపికైంది 'మహర్షి'. 'ఉత్తమ వినోదాత్మక చిత్రం'తో పాటుగా 'ఉత్తమ కొరియోగ్రాఫర్'గా డ్యాన్స్ మాస్టర్ రాజు సుందరం కు అవార్డులు వచ్చాయి. అయితే 'మహర్షి' చిత్రానికి జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కుతుందని ఈ సినిమా సెట్స్ పైకి వెల్లకముందే మహేష్ బాబు అంచనా వేసినట్లు తెలుస్తోంది. తాజాగా మహేష్ బాబుతో వాట్సాప్ లో వంశీ పైడిపల్లి జరిపిన సంభాషణకు సంబంధించిన స్క్రీన్ షాట్ ట్విట్టర్ లో షేర్ చేశారు.
వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేసిన 'ఊపిరి' చిత్రానికి ఫిలిం ఫేర్ అవార్డు రావడంతో అతనికి శుభాకాంక్షలు తెలుపుతూ 2017 జూన్ లో మహేష్ బాబు వాట్సాప్ మెసేజ్ చేశారు. ''ఫిలిం ఫేర్ గౌరవం దక్కిందని ఇప్పుడే విన్నాను.. నెక్స్ట్ సినిమాకు జాతీయ గౌరవం అందుకుంటావు'' అని మహేష్ పేర్కొన్నాడు. దీనికి వంశీ కృతజ్ఞతలు చెబుతూ అందుకోసం గట్టిగా ప్రయత్నిస్తానని రిప్లై ఇచ్చాడు. మహేష్ దీనికి స్పందిస్తూ.. ''మన సినిమా కోసం ఏం కావాలన్నా చేయడానికైనా నేను సిద్ధంగా ఉంటాను.. దీన్ని మరో స్థాయికి తీసుకెళ్లు'' అని పేర్కొన్నాడు. ఈ స్క్రీన్ షాట్ చూసిన ఫ్యాన్స్ ‘మహర్షి’ మీద మహేష్ కు స్క్రిప్టు దశలోనే జాతీయ అవార్డు వస్తుందని చెప్పడం మాములు విషయం కాదని కామెంట్స్ చేస్తున్నారు. ఇక వంశీ పైడిపల్లి ట్వీట్ చేస్తూ ''మహేష్ సర్ అప్పుడు మహర్షి మీద పెట్టుకున్న నమ్మకం వల్లే ఇప్పుడు ఈ అవార్డ్ దక్కింది. మహర్షి పై ఎంత భరోసానో చెప్పడానికి 2017లోనే ఆయన మాటలే నిదర్శనం. మీ మాటలు నిజమయ్యాయి. థాంక్యూ సర్'' అని పేర్కొన్నారు.