పోటీ గురించి మాట్లాడిన సూపర్ స్టార్

Update: 2020-01-11 11:26 GMT
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'సరిలేరు నీకెవ్వరు' ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  ఒక్క రోజు గ్యాప్ లో అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' రిలీజ్ కానుంది.  సరిగ్గా వారం రోజుల క్రితం రెండు సినిమాల విడుదల తేదీల విషయంలో కన్ఫ్యూజన్ నెలకొన్న విషయం తెలిసిందే.  రెండు సినిమాలను ఒకే రోజు రిలీజ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఫీలర్స్ రావడంతో అటు ట్రేడ్ వర్గాలు ఇటు బయ్యర్లు అందోళన వ్యక్తం చేశారు.

అయితే ఇండస్ట్రీ పెద్దలు సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించడంతో ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారమే ఒక రోజు గ్యాప్ లో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.  ఈ పోటీ గురించి... ఒకే రోజు సినిమాలు విడుదల కాకుండా రెండు సినిమాల యూనిట్లు సర్దుకోవడం గురించి రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మహేష్ బాబు ఓపెన్ అయ్యారు.  అందరూ అనుకున్నట్టుగా ఇది పోటీ గురించి కాదని..రెవెన్యూ షేరింగ్ ప్రధానమని మహేష్ స్పష్టం చేశారు. రెండు సినిమాలు ఒకే రోజున విడుదల అయితే రెండిటికీ నష్టం జరుగుతుందని..  సోలోగా రిలీజ్ అయితే పెట్టుబడి పెట్టినవారు నష్టపోకుండా ఉంటారనే ఆలోచనతో ఇలా సోలో రిలీజ్ కోసం ప్లాన్ చేశామని తెలిపారు.

మహేష్ బాబు.. అల్లు అర్జున్ సినిమాలపై ట్రేడ్ వర్గాలు దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాయి. మరి ఈ సంక్రాంతి సినిమాలు రెండూ విజయం సాధించి బయ్యర్లకు డిస్ట్రిబ్యూటర్లకు నిజమైన పండగ తీసుకొస్తాయా అనేది వేచి చూడాలి.
Tags:    

Similar News