డైరెక్ట‌ర్లు వ‌ద్ద‌న్నా..మ‌హేష్ వ‌ద‌ల‌డు!

Update: 2022-06-25 07:30 GMT
ఎలాంటి న‌టుడైనా ఆన్ సె ట్స్ లో బెస్ట్ అవుట్ ఫుట్ ఇవ్వ‌డానికి ప్ర‌య‌త్నిస్తుంటారు. ప్ర‌తీ స‌న్నివేశంలో వీలైనంత నేచురాలిటీని చూపించ‌డానికి టేక్ లు మీద టేక్ లు తీసుకుంటారు. అయితే ఇదంతా ద‌ర్శ‌కుడు ఆధ్వ‌ర్యంలో జ‌రుగుతుంది కాబ‌ట్టి..ఆయ‌న ఎప్పుడు ఒకే చేప్తే అప్పుడు అక్క‌డితే ఆ సీన్ వ‌దిలేసి..తుద‌ప‌రి సీన్ కి వెళ్లాల్సి ఉంటుంది.

ఆ విష‌యంలో డైరెక్ట‌ర‌ల‌కి న‌టులు ఎదురు చెప్ప‌డానికి వీలుండ‌దు. ఆన్ సెట్స్ లో మేక‌ర్ డెసిష‌న్ అన్న‌దే తుదిగా ఉంటుంది. ఒక క‌థకి..స‌న్నివేశానికి ద‌ర్శ‌కుడే  ప్రాణ ప్ర‌తిష్ట  కాబ‌ట్టి ఆయ‌న‌ మాట‌ని..నిర్ణ‌యాన్ని కాద‌న‌డానికి ఉండ‌దు. ఈ విష‌యంలో ఎంత పెద్ద స్టార్ అయినా స‌రే ద‌ర్శ‌కుడి మాట‌కు క‌ట్టుబ‌డి ఉండాల్సిందే. అయితే సూప‌ర్ స్టార్ మ‌హేష్ విష‌యంలో మాత్రం కాస్త భిన్నంగానే క‌నిపిస్తుంది స‌న్నివేశం.

అవును మ‌హేష్ ఏ స‌న్నివేశంలోనైనా ఎంత వీలైంత అంత స‌హ‌జ‌సిద్దంగా న‌టించ‌డానికి...ది బెస్ట్ ఇవ్వ‌డానికి ఎంతో త‌పిస్తాడ‌ని ఆయ‌న మాట‌ల్ని బ‌ట్టి  తెలుస్తోంది. డైరెక్ట‌ర్ ఒకే చెప్పినా మ‌రో మూడు నాలుగు టేక్ లు చేద్దామ‌ని మ‌హేష్  చొర‌వ తీసుకుంటారుట‌. ఆ విష‌యంలో ''వ‌న్ మోర్ వ‌న్ మోర్'' అంటూ మ‌హేష్ సెట్ లో అంద‌ర్నీ క‌న్విన్స్ చేస్తాడుట‌.

సీన్  బాగా వ‌చ్చింద‌ని మ‌హేష్ ద‌గ్గ‌రికి వెళ్లి ఎంతో ఎగ్జైట్ మెంట్ తో  చెబితే ఆయ‌న ఇంకో టేక్ చేద్దామ‌ని కూల్ గా చెబుతారుట‌. అలా క‌నీసం  ఒక్కో సీన్ కి నాలుగైదు టేక్ లు తీసుకుంటారుట‌. ద‌ర్శ‌కుడు బాగా వ‌చ్చింది..ఇంకెందుకు సార్ వ‌దిలేయండి అన్నా స‌రే ఇంకొక్క‌సారి చేద్దాం అని క‌న్విన్స్  చేస్తారుట‌. ఆ విష‌యంలో ద‌ర్శ‌కులు త‌న‌కెంతో స‌హ‌కారం చేస్తార‌ని...ఎవ‌రూ త‌న‌న‌ని ఇబ్బంది పెట్ట‌ర‌ని అంటున్నారు మ‌హేష్‌.

వాటిలో బెస్ట్ టేక్ ని తీసుకుని ఫైన‌ల్ చేస్తామ‌ని అంటున్నారు. న‌చ్చ‌ని స‌న్నివేశంతో ఎడిటింగ్ టేబుల్ వ‌ద్ద ఆలోచించ‌డం క‌న్నా ముందుగా ఇలా జాగ్ర‌త్త ప‌డితే మంచిద‌న్న‌ది ఆయ‌న ఉద్దేశం క‌నిపిస్తుంది.  అయితే ఇప్ప‌టివ‌ర‌కూ మ‌హేష్ తో ప‌నిచేసిన ద‌ర్శ‌కులంతా మ‌హ‌ష్ పెద్ద స్టార్ అయిన త‌ర్వాత  అత‌నితో సినిమాలు చేసారు కాబ‌ట్టి ఏమ‌న‌లేరు.

మ‌రి ఈ విధానం  ద‌ర్శ‌క‌దిగ్గజాలు  రాజ‌మౌళి...శంక‌ర్ లాంటి వాళ్ల వ‌ద్ద  వ‌ర్కౌట్ అవుతుందా?  అన్న‌ది స‌శేష‌మే. ఎందుకంటే ఇద్ద‌రు పాన్ ఇండియా ద‌ర్శ‌కులు. వాళ్లు చెప్పిన‌ట్లు న‌టులు నడుచుకోవాల్సిందే. త్వ‌రలో మ‌హేష్ -రాజ‌మౌళితో ఆప్రికన్ ఆడ‌వుల నేప‌థ్యంలో ఓ పాన్ ఇండియా చిత్రాన్ని చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

వ‌చ్చే ఏడాది ఆ సినిమా సెట్స్  కి వెళ్ల‌నుంది.  మ‌రి ఆయ‌న వ‌ద్ద ఇలాంటి రీటేక్ లు అంటే ? వ‌ర్కౌట్ అవుతాయా? అన్న‌ది చూడాలి. అలాగే శంక‌ర్ ఎంతో మంది స్టార్ల‌ని డైరెక్ట్ చేసారు. మ‌హేష్  హీరో కాక ముందే శంక‌ర్ పెద్ద ద‌ర్శ‌కుడు అన్న సంగ‌తి తెలిసిందే. మ‌రి ఈ కార‌ణంగానూ శంక‌ర్ తో చేయాల్సిన  'త్రీ ఇడియ‌ట్స్'  రీమేక్ కి మ‌హేష్ నో చెప్పాడా? అన్న సందేహం  తెర‌పైకి వ‌స్తోంది.
Tags:    

Similar News