టాలెంటు ఉంటే అదృష్టం నీ వెంటే!

Update: 2019-03-10 05:24 GMT
విజ‌య్ దేవ‌ర‌కొండ‌, సందీప్ వంగా క‌ల‌యిక‌లో `అర్జున్‌రెడ్డి` సంచ‌ల‌నాల గురించి తెలిసిందే. ఈ చిత్రం తెలుగు సినిమా స్వ‌రూపాన్నే మార్చేసింది. క‌మ‌ర్షియ‌ల్ చ‌ట్రం.. స్టార్ హీరోలు మాత్ర‌మే న‌టిస్తే ప్రేక్ష‌కులు థియేట‌ర్‌కు వ‌స్తారనే పాత చింత‌కాల‌య లెక్క‌ల్ని చెత్త‌బుట్ట‌లోకి నెట్టేసింది. దీంతో తెలుగు సినిమా చ‌రిత్ర‌లో మ‌రో కొత్త అధ్యాయం మొద‌లైంది. కొత్త నీరు..కొత్త ఆలోచ‌న‌లు, కొత్త త‌ర‌హా సినిమాల రూప‌క‌ల్ప‌న, తెలుగు సినిమా మేకింగ్ .. టేకింగ్‌లోనే కొత్త ఒర‌వ‌డికి శ్రీ‌కారం చుట్టింది. స్టార్ హీరో తొడ‌గొట్టి స‌వాలు చేసి వంద మందిని తెగ‌న‌రికినా సినిమా థియేట‌ర్‌లో నిల‌బ‌డ‌టం లేదు.

కంటెంట్ కి త‌ప్ప స్టార్ కి విలువ త‌గ్గిపోతోంది. కంటెంట్ తో కొట్టేవాడే ఇక్క‌డ స్టార్ అన్న రోజులొచ్చాయి. ఈ ద‌శ‌లో `యాత్ర‌` ఫేమ్ మహి వి. రాఘ‌వ్ కొత్త త‌ర‌హా ఆలోచ‌న‌కు శ్రీ‌కారం చుట్టారు. `త్రీ అట‌మ‌న్ లీవ్స్‌` (మూడు శ‌ర‌దృతువు ఆకులు) అనే పేరుతో కొత్త టాలెంట్ ను ప్రోత్స‌హించేందుకు ఓ కంపెనీ తెరిచారు. టాలెంట్ వున్న వాళ్ల‌కు అవ‌కాశం క‌ల్పించి వారికి మంచి పారితోషికంతో పాటు కుదిరితే ద‌ర్శ‌కుడిగా, ర‌చ‌యిత‌గా, స్క్రీన్ ప్లే రైట‌ర్ గా, స్టోరీ టెల్ల‌ర్‌, మూవీ మార్కెటింగ్ డీజైన‌ర్ గా అవ‌కాశం ఇవ్వ‌డానికి కొత్త త‌ర‌హా పద్ద‌తికి శ్రీ‌కారం చుట్టారు. టాలెంట్ వున్న ప్ర‌తీ ఒక్క‌రికి ఇది మంచి అవ‌కాశం. స్టార్ ల ద‌గ్గ‌రికి వెళ్లడానికి ఎళ్ల త‌ర‌బ‌డి ఎదురుచూస్తూ త‌మ విలువై కాలాన్ని వృధా చేసుకోవాల్సిన అవ‌స‌రం ఇక లేద‌నేది అత‌డి ప్లాన్ డిజైన్ లో ఒక భాగం అని అర్థ‌మ‌వుతోంది.  

మ‌హి వి. రాఘ‌వ్ ఏర్పాటు చేసిన `త్రీ అట‌మ‌న్ లీవ్స్‌`లో ద్వారా త‌మ టాలెంట్ ని నిరూపించుకునే అవ‌కాశాన్ని క‌ల్పిస్తున్నారు. టాలెంట్ వున్న వాళ్ల‌కి మంచి పారితోషికాన్ని కూడా ఆఫ‌ర్ చేస్తుండ‌టం చెప్పుకోద‌గ్గదేన‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. ఈ త‌ర‌హా హాలీవుడ్‌లో ఎప్పుడో మొద‌ల‌య్యాయి. మ‌న ద‌గ్గ‌ర ప్రారంభం కావ‌డం ఇదే మొద‌టిది. సినిమాకు కావాల్సిన స్క్రిప్ట్‌ని ఓ సంస్థ అందిస్తుంది. ఇలాంటివి టాలీవుడ్ లో ల‌బ్ధ ప్ర‌తిష్ఠులైన కొంద‌రు నిర్మాత‌లు.. అగ్ర బ్యాన‌ర్లు.. అగ్ర ద‌ర్శ‌కులు మాత్ర‌మే చేస్తున్నాయి. వాటికి అతీతంగా.. ఓ అప్ కం ద‌ర్శ‌కుడు ఇలాంటి ప్ర‌య‌త్నం చేయ‌డం అన్న‌ది ఇదే తొలిసారి. భారీ టీమ్‌, భారీ పారితోషికం..అలాంటి సంప్ర‌దాయాన్ని టాలీవుడ్ లో మొద‌లుపెట్టిన మ‌హి వి. రాఘ‌వ్ నిజంగా అభినంద‌నీయుడే.
Tags:    

Similar News