ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు కేన్సర్ మహమ్మారి బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే. సోనాలి బింద్రే.. మనీషా కోయిరాల.. హంసా నందిని లాంటి పలువురు మహమ్మారిని జయించి ఎంతో మంది బాధితులకు స్పూర్తిగా నిలిచారు. తాజాగా మరో బాలీవుడ్ హీరోయిన్ కూడా కేన్సర్ బారిన పడిన విషయం అనుపమ్ ఖేర్ ట్వీట్ తో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఆమె మహిమా చౌదరి. కొంత కాలంగా మహిమా చౌదరి బ్రెస్ట్ క్యాన్సర్ తో బాధపడుతున్నట్టు నటుడు అనుపమ్ ఖేర్ వెల్లడించారు. దీనికి సంబంధించి నేరుగా ఓ వీడియోని రిలీజ్ చేసారు. ఈ సందర్భంగా మహిమని అనుపమ్ ఖేర్ ఓ హీరోగా వర్ణించారు.
``అభిమానులందరకీ ఈ విషయాన్ని నేను చెప్పాలని ఆమె ఆశించారు. మహిమ చౌదరి ధైర్యం..కేన్సర్ కి సంబంధించిన కథనం అంటూ ఆయన చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. `నా 525వ చిత్రం `ద సిగ్నేచర్`లో కీలక పాత్ర పోషించే విషయమై నేను నెల క్రితం అమెరికా నుంచి మహిమా చౌదరికి కాల్ చేశాను. ఆ మాటల సమయంలోనే ఆమెకు బ్రెస్ట్ కేన్సర్ ఉందని తెలిసింది.
ఈ విషయాన్ని బయటకు వెల్లడించడంలో నేను కూడా భాగం కావాలని ఆమె కోరుకున్నారు. అందుకే ఆమె ఇష్టం ప్రకారం ఆమె ఆనారోగ్య పరిస్థితిని వివరించాల్సి వస్తుంది. అందుకు ఎంతో బాధగా ఉందని బరువెక్కిన హృదయంతో స్పందతించారు.
స్నేహితులారా మీ ప్రేమ..దీవెనలు..ప్రార్ధనాలు ఆమెకు ఇప్పుడు ఎంతో అవసరం అని అనుపమ్ రాసుకొచ్చారు.
ఈ విషయంపై మహిమ చౌదరి కూడా ఎంతో గుండె నిబ్బరంతో స్పందించారు. తన సినిమాలో నటించాలని అనుపమ్ కాల్ చే సారు. ఆ సమయంలో నేను ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాను. అప్పటికే చాలా మంది కాల్స్ చేసి అవకాశాలు ఇచ్చారు. కానీ చేస్తాను అని చెప్పలేని స్థితిలో నేను ఉన్నాను. వాళ్లకి నా పరిస్థితి తెలియదు.
నా జుట్టు అంతా ఊడిపోయింది అంటూ ఆమె భావోద్వేగానికి గురయ్యారు. అలాగే ముందుగా తనకు ఎలాంటి క్యాన్సర్ లక్షణాలు ఏవీ లేవని.. సాధారణ చెకపుల్లో అది బయటపడినట్టు ఆమె తెలిపారు. ప్రస్తుతం మహిమ చౌదరి ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. అందులో ఆమెకు జుట్టు అంతా ఊడిపోయి .. బాగా నీరసించి కనిపిస్తున్నారు.
దీంతో సెలబ్రిటీలు.. నెటి జనులు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నారు. మహిమా చౌదరి తెలుగులో `మనసులో మాట` సినిమాలో నటించారు. కొంత కాలంగా బాలీవుడ్ సినిమాలకు దూరంగా ఉంటున్నారు. `పరదేశ్` సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మహిమా చౌదరి 2016 వరకూ సినిమాలు చేసారు. చివరిగా `డార్క్ చాక్లెట్` అనే సినిమాలో నటించారు.