హీరోయిన్‌ రహస్య నిశ్చితార్థం

Update: 2019-05-02 11:15 GMT
బాలీవుడ్‌ హీరోయిన్స్‌ ప్రేమలో ఉండటం - రిలేషన్‌ షిప్‌ మెయింటెన్‌ చేయడం వంటివి చాలా కామన్‌ గా మనం చూస్తూనే ఉంటాం. ఎక్కువ మంది ప్రేమించి పెళ్లి వరకు వెళ్లరు - కొద్ది మంది మాత్రం పెళ్లి వరకు వెళ్తారు. పాకిస్తానీ ముద్దుగుమ్మ మహీరా ఖాన్‌ బాలీవుడ్‌ లో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. టీవీ షోల్లో కూడా ఈమె అలరించింది. 2007లో హఫీజ్‌ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని - ఒక బాబుకు కూడా జన్మనిచ్చిన మహీరా 2014లో అతడి నుండి విడిపోయింది. హఫీజ్‌ నుండి విడిపోయిన తర్వాత వ్యాపారవేత్త సలీమ్‌ తో ప్రేమలో ఉంది. వీరిద్దరు డేటింగ్‌ లో ఉన్నారని - సహజీవనం సాగిస్తున్నారు అంటూ ప్రచారం జరిగింది.

ఇప్పటి వరకు సలీమ్‌ తో ప్రేమ విషయంలో మహీరా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ సమయంలోనే మహీరా - సలీమ్‌ ల వివాహ నిశ్చితార్థం టర్కీలో అయినట్లుగా చెబుతున్నారు. వీరిద్దరికి సంబంధించిన ఒక ఫొటో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. దాంతో వీరిద్దరు వివాహ నిశ్చితార్థం అయినట్లుగా ప్రచాం జరుగుతుంది. అయితే ఈ విషయమై కూడా మహీరా స్పందించేందుకు ఆసక్తి చూపడం లేదు.

టర్కీలో సలీమ్‌ మరియు మహీరా కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి వివాహ నిశ్చితార్థం అయ్యిందని, త్వరలోనే పెళ్లి కూడ జరిపేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా బాలీవుడ్‌ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. మహీరా పెళ్లి విషయంను ఎందుకు ఇంత గోప్యంగా ఉంచుతుందో ఆమెకే తెలియాలి. పెళ్లి వరకు అయినా తన విషయాన్ని బాహాటంగా ఈమె ప్రకటిస్తుందేమో చూడాలి.

Tags:    

Similar News