పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ నటిస్తున్న తాజా చిత్రం `రొమాంటిక్` ప్రస్తుతం ఆన్ సెట్స్ ఉన్న సంగతి తెలిసిందే. గోవా షెడ్యూల్ ఫుల్ స్వింగ్ లో ఉందని నిర్మాత ఛార్మి కౌర్ సామాజిక మాధ్యమాల్లో అప్ డేట్ అందించిన సంగతి తెలిసిందే. ఆన్ లొకేషన్ స్టిల్స్ ని రివీల్ చేశారు. అయితే ఈ సినిమా కాస్టింగ్ లో సంథింగ్ స్పెషల్ ఆర్టిస్టులు కనిపిస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్ హాట్ గాళ్ మందిరా భేడీని ఓ కీలక పాత్ర కోసం ఎంపిక చేసుకున్న పూరి- ఛార్మి అండ్ టీమ్ .. ఇప్పుడు మకరంద్ దేశ్ పాండే లాంటి ట్యాలెంటెడ్ స్టార్ ని ఎంపిక చేసుకున్నారు. మకరంద్ టాలీవుడ్ కి కొత్తేమీ కాదు. అతడు పూరి తెరకెక్కించిన ఏక్ నిరంజన్, త్రివిక్రమ్ దర్శకత్వంలో జల్సా చిత్రాల్లో నటించాడు.
ఆ తర్వాత శ్రీనివాసరాజు తెరకెక్కించిన `రా` మెటీరియలిస్టిక్ `దండుపాళ్యం` లోనూ ఓ కీలక పాత్ర పోషించాడు. రేప్ లు.. మర్డర్ లు.. చేసే కిరాతకుడిగా మకరంద్ అభినయం విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. పీక కోసి చివ్వున చిందే ఆ నెత్తురు వాసన చూస్తే సమ్మగా ఉంటుందని పోలీసులకే చెప్పే కిరాతకుడిగా ఆ చిత్రంలో కనిపించాడు. పెర్ఫామెన్స్ లో నసీరుద్ధీన్ షా, షాయాజీ రేంజు అతడు. అందుకే `రొమాంటిక్` చిత్రంలో అతడు ఎలాంటి పాత్రలో నటించబోతున్నాడు? అన్న క్యూరియాసిటీ నెలకొంది.
ఆకాష్ సరసన ఈ చిత్రంలో కేతిక శర్మ అనే ఉత్తరాది ముద్దుగుమ్మ నాయికగా నటిస్తోంది. చిరుత ఫేం నేహా శర్మకు కజిన్ లా ఉందీ అమ్మడు. ఇక ఈ చిత్రానికి పూరి స్వయంగా డైలాగులు, రచన అందించారు కాబట్టి ఆ మేరకు అంచనాలు పెరిగాయి. మెహబూబా ఫ్లాప్ వల్ల కసితో రగిలిపోయిన ఈ బృందం భారీ ప్రణాళికలతో దూసుకుపోతోంది. హిట్టు కొట్టడమే ధ్యేయంగా టీమ్ వర్క్ చేస్తోంది. అనీల్ పాడూరి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ వేసవిలోనే రొమాంటిక్ రిలీజ్ కానుంది.