నటసింహం నందమూరి బాలకృష్ణ - 'క్రాక్' డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. 'అఖండ' సినిమా తర్వాత బాలయ్య చేసే ప్రాజెక్ట్ ఇదేనని ఇప్పటికే క్లారిటీ వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని - వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం '#NBK107' కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు ''రౌడీయిజం'' అనే టైటిల్ ను పెడుతున్నట్లు సోషల్ మీడియాలో ఊహాగానాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై చిత్ర నిర్మాతలు స్పందించారు.
#NBK107 టైటిల్ ను సరైన సమయం వచ్చినప్పుడు అధికారికంగా ప్రకటిస్తామని.. అప్పటి వరకు ఎలాంటి ఊహాగానాలను నమ్మవద్దని మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటన విడుదల చేసారు. ''#NBK107 టైటిల్ ను ఫిక్స్ చేసారని మీడియాలో కథనాలు వస్తున్నాయి. అవి నిజం కాదు. ఈ చిత్రానికి సరిపోయే టైటిల్ ను మరియు సినిమాకు సంబంధించిన ఇతర వివరాలను సరైన సమయం వచ్చినప్పుడు ప్రకటిస్తాం'' అని మేకర్స్ పేర్కొన్నారు.
కాగా, #NBK107 వాస్తవ సంఘటన ఆధారంగా రాసుకున్న ఓ పవర్ ఫుల్ స్టోరీతో తెరకెక్కనుంది. 'క్రాక్' సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న గోపీచంద్ మలినేని.. బాలయ్యను సరికొత్త అవతారంలో ప్రెజెంట్ చేయబోతున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో స్టార్ క్యాస్టింగ్ - టాప్ టెక్నిషియన్స్ భాగం అవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో కీలకమైన పాత్ర కోసం టాలెంటెడ్ యాక్ట్రెస్ వరలక్ష్మీ శరత్ కుమార్ ను ఎంపిక చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ ని తీసుకున్నారు. 'అఖండ' సినిమా పూర్తైన తర్వాత ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.