సూపర్‌ స్టార్‌ సినిమా క్యాన్సిల్‌ పుకార్లపై క్లారిటీ

Update: 2020-07-17 07:15 GMT
తమిళ సూపర్‌ స్టార్‌ విజయ్‌ ‘మాస్టర్‌’ విడుదలకు సిద్దంగా ఉంది. ఏడాదికి రెండు సినిమాలు తప్పకుండా చేస్తూ వస్తున్న విజయ్‌ మాస్టర్‌ విడుదలకు ముందే మురుగదాస్‌ చిత్రాన్ని లైన్‌ లో పెట్టాడు. కాని కరోనా కారణంగా మాస్టర్‌ విడుదల కాలేదు.. మురుగదాస్‌ మూవీ షూటింగ్‌ కూడా ప్రారంభం కాలేదు.  ఈ సమయంలోనే తమిళ మీడియాలో నిర్మాణ సంస్థ సన్‌ పిక్చర్స్‌ తో మురుగదాస్‌ విభేదించాడని స్క్రిప్ట్‌ విషయంలో వచ్చిన విభేదాల కారణంగా సినిమా క్యాన్సిల్‌ అయ్యిందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

మీడియాలో విజయ్‌ 65 గురించి వస్తున్న వార్తలపై నిర్మాణ సంస్థ సన్‌ పిక్చర్స్‌ వారు స్పందించారు. మీడియాలో వస్తున్న వార్తలు పూర్తి పుకార్లే అంటూ క్లారిటీ ఇచ్చారు. సినిమా క్యాన్సిల్‌ అనే వార్తలు పూర్తిగా అవాస్తవం. దర్శకుడు మురుగదాస్‌ తో తాము ఎలాంటి విభేధాలను కలిగి లేము.. మా మద్య మంచి వాతావరణం ఉందని సన్‌ పిక్చర్స్‌ అధికారిక ప్రతినిధులు పేర్కొన్నారు.

స్క్రిప్ట్‌ విషయంలో మురుగదాస్‌ పర్‌ ఫెక్ట్‌ గా ఉంటాడని అందులో ఎలాంటి డౌట్‌ లేదని వారు అన్నారు. ఇలాంటి పుకార్లను విజయ్‌ అభిమానులు నమ్మి ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. అతి త్వరలో ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారికంగా ప్రకటిస్తామని పేర్కొన్నారు.
Tags:    

Similar News