18 ఏళ్ల బంధానికి చివరి 6 నెలలు

Update: 2016-12-02 05:30 GMT
జై చిరంజీవ చిత్రంలో విలన్ గా నటించిన అర్బాజ్ ఖాన్.. గబ్బర్ సింగ్ లో కెవ్వుకేక అంటూ ఆడిపాడిన మలైకా అరోరాలు.. తమ 18 ఏళ్ల దాంపత్య జీవితానికి చరమగీతం పాడేస్తున్నారు. ఇప్పటికే విడిపోవాలని డిసైడ్ అయిపోవడం.. విడివిడిగానే జీవిస్తుండడం.. కోర్టులో డైవోర్స్ పిటిషన్ వేయడం జరిగిపోగా.. తాజాగా వీరికి కౌన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నం కూడా చేసింది కోర్ట్.

విడాకులు మంజూరు చేసేందుకు ముందు కౌన్సిలర్.. జడ్జ్ లు.. ఆ జంటకు కౌన్సిలింగ్ ఇచ్చి.. ఆఖరి అవకాశం ఇవ్వడం జరుగుతుంటుంది. అర్బాజ్ - మలైకాలకు కూడా ఇలాంటి కౌన్సిలింగ్ జరిగింది. 'ఎందుకు విడాకులు తీసుకుంటున్నారు.. మీ మధ్య వచ్చిన విబేధాలే కారణమా.. అవి రూపుమాపుకునే అవకాశం లేదా.. ఎవరైనా ఇలాంటి ఒత్తిడి తీసుకొస్తున్నారా..' అంటూ అర్బాజ్-మలైకాలకు ఎదురైన ప్రశ్నలకు చాలా మెచ్యూర్డ్ గా సమాధానం ఇచ్చారట ఈ జంట.

కౌన్సిలింగ్ కూడా పూర్తయింది కాబట్టి.. వీరిద్దరికి 6 నెలల కూలింగ్ పీరియడ్ తర్వాత విడాకులు మంజూరు చేస్తారు. మే 11న కోర్టుకు హాజరు కావాలని కోర్టు చెప్పడంతో.. దాదాపుగా అదే రోజున డైవోర్స్ ఇచ్చేసే అవకాశాలున్నాయి. 18 ఏళ్ల అర్బాజ్-మలైకాల కాపురం మరో ఆరు నెలల్లో ముగిసిపోనుందన్న మాట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News