లోకులు పలుగాకులు..! తనకంటే పెద్ద వయసు ఉన్న .. ఓ ముదురు వయసు ఆంటీని ఓ యువకుడు పెళ్లాడుతున్నాడు అంటే ఒప్పుకుంటుందా? 45 వయసు ఆంటీని 33 వయసు కుర్రాడు పెళ్లాడుతున్నాడు అంటే లోకం అంగీకరిస్తుందా? కానీ ఈ ఎపిసోడ్ లో నిట్టూర్పులకు ఆస్కారం లేదుట. ఎందుకంటే ఆ ఇద్దరూ ఎంతో కాలంగా ఎఫైర్ సాగిస్తున్నారని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఓవైపు పెళ్లయి ఓ బిడ్డకు తల్లి అయినా సదరు సుందరాంగి ఈ కుర్రహీరోతో ఎఫైర్ సాగించడం పెనుదుమారానికి తెరలేపింది అప్పట్లో. అదంతా గతం అనకుంటే - ఇప్పుడు ఊహించని పిడుగులాంటి పరిణామం.
కొన్ని నెలల క్రితం సదరు ఐటెమ్ గాళ్ భర్తకు విడాకులు ఇచ్చింది. అటుపై ఒంటరిగానే స్వేచ్ఛా జీవనం సాగిస్తోంది. ఆ క్రమంలోనే కుర్రహీరోతో డేటింగ్ వ్యవహారం కెవ్వుకేక అంటూ పలుమార్లు ఆసక్తికర చర్చకు తావిచ్చింది. అప్పట్లో ఓ టీవీ రియాలిటీ షోలో తనతో కలిసి చెయ్యి చెయ్యి కలిపి స్టెప్పులేశాడు. మొన్నటికి మొన్న ఇటలీలో తన 45వ పుట్టినరోజు పార్టీకి కుర్రహీరో ఎటెండ్ అయ్యాడు. అతగాడి వ్యవహారంపై ఓవైపు బాలీవుడ్ మీడియా కోడై కూస్తున్నా ఇవేవీ పట్టనేలేదు.
తాజాగా మరో బాంబ్ లాంటి వార్త బాలీవుడ్‌ని కుదిపేస్తోంది. ఆ ఇద్దరూ వచ్చే ఏడాది పెళ్లి చేసుకునేందుకు రెడీ అవుతున్నారట. మొన్న ఇటలీ పార్టీ అయిపోగానే, నిన్న ముంబైలో సదరు భామామణి స్నేహితురాళ్లు ఘనంగా బిలీటెడ్ బర్త్ డే పార్టీ ఇచ్చారట. ఈ పార్టీలో స్పెషల్ గెస్ట్ ఎవరో తెలుసా? ఆ కుర్రహీరోనే. తమ గుంపునకు ఉరకలెత్తే కుర్రాడు యాడయ్యాడన్న ఆనందంలో రేతిరంతా ఫుల్‌గా చిలౌట్ చేశారట. ఇంతకీ ఈ వ్యవహారంలో నాయకానాయికలు ఎవరు? అంటే బోనికపూర్ కుమారుడు అర్జున్ కపూర్- మలైకా అరోరాఖాన్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. ``ఆ ఇద్దరూ ఒకరంటే ఒకరు పడి చస్తున్నారు. తమ బాంధవ్యం గురించి ఏనాడూ బయటకు చెప్పలేదు కానీ, తమ స్నేహం, కలయిక ఎంతో ఆనందదాయకం. ప్రస్తుతం ఈ బంధం పెనుబంధంగా మారింది. ఇక అన్ని రూమర్లకు చెక్ పెట్టేస్తే మూడుముళ్ల బంధంతో ఏకం కావడానికి రెడీ. వచ్చే ఏడాది పెళ్లికి రెడీ అవుతున్నారు`` అని ప్రఖ్యాత మిడ్‌డే ఓ కథనంలో పేర్కొంది. మొత్తానికి ముదురు భామ- కుర్రహీరో లవ్‌స్టోరి ఓ కొలిక్కి వస్తోందన్నమాట!!