ఆ ఇద్దరూ విడివిడిగా ఎవరి లగేజ్ తో వాళ్లు విదేశాలకు వెళతారు. అప్పటికప్పుడే ఏదో హడావుడి అన్నట్టే బయల్దేరతారు. అలా విమానాశ్రయంలో కలుస్తారు. ఆ తర్వాత కొన్ని దినాల పాటు ఎవరికీ కనిపించరు. ఎక్కడో విదేశీ డెస్టినేషన్ నుంచి కొన్ని ఫోటోలు మాత్రం లీక్ చేసి ఇదిగో ఇక్కడున్నాం! అని ఫ్యాన్స్ కి సోషల్ మీడియాలో హింటిస్తారు. గత రెండేళ్లుగా చూస్తున్నదే ఈ తంతే.
ఆర్భాజ్ ఖాన్ కు విడాకులు ఇచ్చినప్పటి నుంచి మలైకా అరోరాఖాన్ .. యువహీరో అర్జున్ కపూర్ తో చెట్టాపట్టాల్ అంటూ షికార్లు చేయడం.. అటుపై ఈ జంట పెళ్లికి రెడీ అవుతోందన్న ప్రచారం తెలిసిందే. ప్రతిసారీ ఈ జోడీ విమానాశ్రయాల సాక్షిగా మీడియా కంటికి చిక్కడంతో ఆ వార్తలు ప్రముఖంగా ప్రచారం అవుతున్నాయి. తాజాగా మరోసారి ఈ ప్రేమ గువ్వలు విదేశాలకు వెళుతూ కెమెరా కంటికి చిక్కారు. వర్షాకాలం ఈ పయనం ఎటు? తూనీగ తూనీగ ఎందాకా పరిగెడతావే? అంటూ యూత్ లో డౌట్లు పుట్టుకొచ్చాయ్!
ఇదే డౌట్ ముంబై మీడియాకి రావడంతో ఒక రేంజులో ఆడేసుకుంటోంది. కాస్త లేట్ నైట్ బయల్దేరారు ఎందుకో. ఎక్కడికో వెళుతున్నారు. ఏదో మంచు దుప్పటి కప్పిన ప్రదేశానికే వెళుతున్నట్టున్నారు. ఆ డ్రెస్సింగ్ చూస్తుంటే అలానే అర్థం చేసుకోవాల్సి వస్తోంది! అంటూ అప్పుడే సెటైర్లు వేసింది ముంబై మీడియా. డార్క్ బ్లాక్ రేతిరిలో ఎర్రెర్రని లెదర్ జర్కిన్లు ధరించి కాంబినేషన్ లెదర్ బాటమ్ తో ముంబై మాఫియాని తలపించేలా ఈ జంట రెడీ అయ్యి ఎక్కడికో వెళుతోంది. ఇంతకీ ఎక్కిడికి వెళుతున్నట్టు? అసలే రెయినీ సీజన్! అంటూ గుసగుసలు వేడెక్కిస్తున్నాయ్.