సమ్మర్ కవర్.. ముగ్గురు భామలు

Update: 2017-05-04 05:52 GMT
భారతీయ సినీ ప్రపంచంలో తాను ఐటెం సాంగ్స్ కోసమే పుట్టానని చెప్పే ధైర్యం ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే.. అది ఒక్క మలైకా అరోరా ఖాన్ మాత్రమే. దాదాపుగా ఈ భామ చేసిన సినిమాలన్నీ ఐటెమ్స్ మాత్రమే. ఏజ్ మీద పడ్డంతో ఈ మధ్య సాంగ్స్ కౌంట్ తగ్గింది కానీ.. 40 ప్లస్ లో ఉన్నా అమ్మడిలో హాట్ నెస్ మాత్రం తగ్గలేదు.

తాజాగా ఈ బాలీవుడ్ ఐటెం బ్యూటీ గ్రేజియా ఇండియా మేగజైన్ కవర్ పేజ్ పైకి ఎక్కేసింది. సమ్మర్ స్పెషల్ గా వచ్చిన ఈ మేగజైన్ లేటెస్ట్ ఎడిషన్ పై సందడి చేసిన మలైకా.. తనకు తోడు మరో ఇద్దరు ముద్దుగుమ్మలను కూడా తీసుకొచ్చేసింది. బాలీవుడ్ హాట్ బ్యూటీగా వెలిగిపోయి.. గతేడాది పెళ్లి చేసుకున్న బిపాషా బసు.. హృతిక్ తో విడాకులు తీసుకున్న సుసానే ఖాన్ తో కలిసి చేసిన స్పెషల్ ఫోటో షూట్ లో ఈ కెవ్వుకేక సుందరాంగి సందడి చేసింది. ముగ్గురూ టైగర్ స్కిన్ ప్యాటర్న్ డ్రెసింగ్ తో భలే డిఫరెంట్ గా కట్టుకున్నారు.

వైల్డ్ సమ్మర్ అంటూ.. ఎండా కాలాన్ని ఎలా ఎంజాయ్ చేయాలో ఈ ముగ్గురు పెళ్లయిన భామలు బాగానే వివరించారు. తాము ఏ స్థాయిలో సందడి చేస్తామో కూడా చెప్పారు. చెప్పడం కంటే.. కవర్ పేజ్ చూస్తేనే వీళ్ల సమ్మర్ హంగామా ఏ స్థాయిలో ఉంటుందో అర్ధమవుతుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/



Tags:    

Similar News