మ‌లైకా.. ఎవ‌రిని తిట్టిందో క‌నిపెట్టారా?

Update: 2020-02-16 01:30 GMT
బాలీవుడ్ ఫిట్ నెస్ క్వీన్ మలైకా అరోరా ఖాన్ లేడీ గ్యాంగ్ గురించి ప‌రిచ‌యం అవ‌సం లేదు. ఈ గ్యాంగ్ లో షారూక్ వైఫ్ గౌరీఖాన్- త‌న సోద‌రి అమృతా అరోరా .. క‌రిష్మా క‌పూర్ త‌దిత‌రులు ఉన్నారు. ఈ లేడీ గ్యాంగ్ నిరంత‌రం ముంబైలో జ‌రిగే పార్టీల్లో చిలౌట్ చేసే ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ అవుతూనే ఉంటాయి. వీళ్లంతా క‌లిసే విదేశీ వెకేషన్లు.. బికినీ బీచ్ విహారాలు.. వ‌గైరా వ‌గైరా ఇప్ప‌టికే హాట్ టాపిక్.

ఇదిగో అలాంటి ట్రిప్ ఏదో త‌గిలిన‌ట్టుంది. మ‌లైకా అరోరాఖాన్ త‌న ఫ్రెండు గౌరీ ఖాన్ స‌హా సోద‌రి అమృత అరోరాఖాన్ తో పాటు ఎక్క‌డికో షికార్ వెళ్లి వ‌స్తోంది. అలా వ‌చ్చేప్పుడు విమానాశ్ర‌యం లో అభిమానులు ఒక‌రితో ఒక‌రు పోటీ ప‌డుతూ సెల్ఫీల కోసం మీద ప‌డ‌బోయారు. అయితే వారిని వారిస్తూ.. అస్స‌లు త‌న‌కు ఫోటోలు ఇచ్చేంత ఆస‌క్తి లేద‌ని తిట్టేసింది మ‌లైకా. త‌న డ్రైవ‌ర్ కి ఏవో సంజ్ఞ‌లు చేస్తూ సీరియ‌స్ అయ్యింది. ప్ర‌స్తుతం ఈ వీడియో వైరల్ కావడం తో నెటిజనులు ఘాటైన వ్యాఖ్య‌లు చేస్తున్నారు.

మలైకా అరోరా - అమృత అరోరా- గౌరీ ఖాన్ ముగ్గురితోనూ సెల్ఫీల కోసం విమానాశ్రయంలో అభిమానులు మీది మీదికొచ్చారు. ఆ ముగ్గురూ చ‌క‌చ‌కా న‌డుచుకుంటూ వ‌స్తూ ఫ్యాన్స్ సెల్ఫీల‌కు ఫోజులిచ్చారు. అయితే మలైకా - అమృత జంట కార్ సమయానికి రాలేదు. దాంతో కోప‌గించుకున్న మ‌లైకా అటు డ్రైవ‌ర్ తో పాటు ఇటు సెల్ఫీల కోసం ఎగ‌బ‌డే వారిని తిట్టేసిందంతే.
Tags:    

Similar News