ప్రేమ గుడ్డిదే అనడానికి సాక్ష్యంగా అర్జున్ కపూర్-మలైకా అరోరా జంటను చూపిస్తోంది బాలీవుడ్ మీడియా. ఈ ఇద్దరు ఏప్రిల్ 19న పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వస్తున్న నేపధ్యంలో ఈ జంట మాల్దీవ్స్ లో ఔటింగ్ కు వెళ్ళిందనే న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నిజానికి ఈ ఇద్దరు అధికారికంగా తమ బంధాన్ని ఇప్పటిదాకా వెల్లడి చేయలేదు. అలా అని బయట తిరగడం మానుకోలేదు కూడా.
ఇటీవలే మలైకా అరోరా ఓ దీవిలో ఉండగా తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. మరోవైపు అర్జున్ కపూర్ చొక్కా లేకుండా బేర్ బాడీతో ఉన్న సెల్ఫీలను బీచ్ ఒడ్డున ఉన్నవి పెట్టాడు. నెటిజెన్లు రెండు కనెక్ట్ చేసి ఇది కపుల్ ట్రిప్ అని నిర్ధారించి సోషల్ మీడియాలో బట్టబయలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన పిక్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి
తన కన్నా పెద్ద అయిన మలైకాను అర్జున్ కపూర్ ప్రేమించడంలో విశేషం లేదు కాని ఆవిడ అప్పటికే సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ తో విడాకులు తీసుకుంది. వయసుకు వచ్చిన పిల్లలున్నారు. రేపో ఎల్లుండో బాలీవుడ్ డెబ్యు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
అర్జున్ కపూర్ లేత కాకపోయినా ఎలిజిబుల్ బ్యాచిలరే. అలాంటప్పుడు మలైకా వెంటపడటం ఏమిటనే కామెంట్స్ గట్టిగానే వినిపించాయి. అయినా కపూర్ బాబుకి అవేవి పట్టడం లేదు. గాసిప్స్ నిజమే అయితే కనక 19న ఒక్కటి కావడం ఖాయం. మరోవైపు అర్జున్ కుటుంబంలో ఒక్క అనిల్ కపూర్ నుంచి మాత్రమే పరోక్ష మద్దతు దక్కింది. బోనీ కాని చెల్లెలు జాన్వీ కాని ఇంతవరకు స్పందించలేదు