ఒగ‌లు మారివే.. సొగ‌సు క‌త్తెవే!

Update: 2018-09-02 01:30 GMT
గోగులు పూసే గోగులు పూసే ఓ ల‌చ్చా గుమ్మాడీ..
గోగులు పూచె గోగులు కాచే ఓ లచ్చ గుమ్మాడీ…
ముంగిట వేసిన ముగ్గులు చూడు ఓ లచ్చ గుమ్మాడి,
ఆ ముద్ద బంతులు పసుపు రాశులు పూసే ఓ ల‌చ్చా గుమ్మాడీ...

ఇక్క‌డ అందాన్ని చూడ‌గానే ఈ తీరుగా మురిసిపోవాల్సిందే. అందానికి అందం.. ప్ర‌తిభ‌కు ప్ర‌తిభ రెండో జోడిస్తే మ‌లైకా అరోరాఖాన్. చెలి ఛ‌య్య ఛ‌య్య ఛ‌య్యా ఛ‌య్యా! అంటూ ఈ అమ్మ‌డు దిల్‌సే చిత్రంలో చేసిన నృత్యం చూశాక ఫిదా అవ్వ‌ని కుర్రాడే లేడు. కెవ్వు కేక అంటూ గ‌బ్బ‌ర్‌సింగ్‌లో ఐటెమ్ పాట‌లో న‌ర్తించింది. బాలీవుడ్‌లో మున్నీకి బ‌ద‌నాహు హూయీ.. అంటూ ద‌బాంగ్‌లో ఓ ఊపు ఊపేసింది. ఐటెమ్ నంబ‌ర్ అంటే మ‌లైకానే అన్న పేరొచ్చింది.

అయితే కాలంతో పాటే మార్పు. కొత్త కొత్త ఐటెమ్ భామ‌లు వచ్చి ప‌డిపోతున్నారు. ఆ క్ర‌మంలోనే మ‌లైకాకు అవ‌కాశాలు త‌గ్గాయి. మునుప‌టితో పోలిస్తే ఇప్పుడు ఇంకా అదే జోష్ చూపించ‌డం కుద‌ర‌దు కాబ‌ట్టి మ‌లైకా కూడా త‌గ్గిపోయింది. ఇటీవ‌లే భ‌ర్త ఆర్భాజ్ నుంచి విడిపోయాక పూర్తిగా ఫ్యాష‌న్ షోలు, టీవీ షోల‌తోనే గ‌డిపేస్తోంది. ప‌నిలోప‌నిగా ఇప్ప‌టికీ అర్జున్ క‌పూర్‌కి మ‌లైకా అరోరాఖాన్ ద‌గ్గ‌ర‌వ్వాల‌నుకుంటోంద‌ని బాలీవుడ్ మీడియాలో జోరుగా క‌థ‌నాలు వెలువ‌డుతున్నాయి. ఆ ఇద్ద‌రూ క‌లిసి ఏ ఫ్యాష‌న్ ఈవెంట్‌లో క‌నిపించినా ఒక‌టే రూమ‌ర్లు.. గాసిప్పులు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ప్ర‌ఖ్యాత టైమ్స్ న‌వ్ న్యూస్ ఈ ఇద్ద‌రి క్లోజ్‌నెస్‌పై ప్ర‌త్యేక క‌థ‌నాన్ని లైవ్ చేసింది. రీసెంట్ గా ప్ర‌ఖ్యాత బ్రైడ్స్ టుడే ఫోటోషూట్‌లో పాల్గొన్న‌ప్ప‌టి ఫోటో ఇది. ఈ ఫోటోలో నాచురంగు డిజైన‌ర్ డ్రెస్‌లో మ‌లైకా అద‌ర‌గొట్టేసింది.
    

Tags:    

Similar News