ఆర్జీవీ తర్వాత మళ్లీ అంతగా వార్తల్లో నానుతున్న ఏకైక సెలబ్రిటీ మలైకా అరోరాఖాన్. ఇంచుమించు ఈ ఇద్దరూ ఒకే తరగతి విద్యార్థుల్లా వివాదాస్పద అంశాలతోనే పాపులరవుతున్న సంగతిని చూస్తున్నాం. మలైకా గత కొంతకాలంగా యువహీరో అర్జున్ కపూర్ తో షికార్లు చేస్తూ వేడెక్కిస్తోంది. నేడు కూడా అర్జున్ తో కలిసి మలైకా ఓ విమానాశ్రయంలో దొరికిపోవడంతో మీడియాలో చర్చ ఇంకా పీక్స్ కి చేరింది.
తాజాగా మలైకాకు సంబంధించిన ఓ స్టన్నింగ్ ఫోటోని ఫ్యాన్స్ సామాజిక మాధ్యమాల్లో జోరుగా వైరల్ చేయడం విశేషం. ఈ ఫోటోలో మలైకా ధరించిన డిజైనర్ వేర్ సంథింగ్ స్పెషల్ గా ఆకట్టుకుంటోంది. పసుపు- నలుపు ఆపోజిట్ కాంబినేషన్ డ్రెస్ డిజైనర్ కళాకృతితో .. ఆర్ట్ వర్క్ తో సంథింగ్ స్పెషల్ గా ఆకట్టుకుంది. ముంబై ఐజీటీ 8 ఫ్యాషన్ ఈవెంట్ లో మలైకా ఇలా తళుక్కుమంది. ప్రస్తుతం ఈ ఫోటోల్ని ఫ్యాన్స్ జోరుగా వైరల్ చేస్తున్నారు. ఇక వేరొక బుల్లితెర ఈవెంట్‌లో మలైకా ఓ మెజీషియన్ సమక్షంలో వేసిన ఫీట్‌కి వీక్షకుల క్లాప్స్ తో గగ్గోలు పెట్టక తప్పలేదు. `ఇండియాస్ గాట్ ట్యాలెంట్ సెమీ ఫైనల్`లో మలైకా మ్యాజిక్ షోలో వేదికపై గాల్లో తేలి కనిపించిన దృశ్యం గగుర్పొడిచేలా చేసిందంటే నమ్మండి.
లైఫ్‌లో ఎన్నో అంకాల్ని దాటుకుంటూ వచ్చిన మలైకా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం పరంగా ఎంతో సంతృప్తిగా - సంతోషంగా ఉన్నానని చెబుతోంది. తన ఎఫైర్ కహానీ గురించి అందరికీ తెలుసని - దాని గురించే పదే పదే తననే ఎందుకు అడుగుతారని ఇదివరకూ ప్రశ్నించింది. తాను ఏం చేసినా స్వేచ్ఛగా జీవించడమే తనకు తెలుసని చెప్పకనే చెప్పింది. ఆ స్వేచ్ఛ ఫ్యాషన్ ప్రపంచంలో లలనామణులకు లేకపోతే ఎలా?