రేస్ బైక్ ర‌త్తాలు స‌లాం గులాం!

Update: 2018-09-15 17:30 GMT
రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు.. నిను చుస్తే నిలబడనంటాయ్‌ నా చొక్కా బొత్తాలు...!! బాసు ఉత్త‌పుణ్యానికే అలాంటి సాంగేసుకోలేదు. ఏడ చూసినా ర‌త్తాలు తాలూకా ఎవ‌రో ఒక‌రు క‌నిపిస్తూనే ఉన్నారు బాసూ.. కాఫీ షాప్‌ - ప‌బ్బు - క్ల‌బ్బు - రెస్టారెంట్ - స్టార్ హోట‌ల్ కాదేదీ ర‌త్తాలు క‌న‌ర్హం! అన్న‌చందంగా ఇదిగో ఇలా దిగిపోతున్నారు.

అప్ప‌ట్లో గ‌బ్బ‌ర్‌ సింగ్ అంత‌టివాడే కెవ్వు కేక అంటూ గుబులు గుబులుగా ఏదో అయిపోయాడు. ఆవిడ సోకులకు స‌లాం స‌లాం.. గులాం గులాం అని మ‌రోసారి జ‌నం తెగ ఇదైపోతున్నారు. బులుగు జిలుగు డెనిమ్ జీనూ ఫ్యాంటూ.. కాంబినేష‌న్ ఎల్లో రేసింగ్ జాకెట్ .. రేబాన్ క‌ళ్ల‌ద్దాలు.. వ్వారెవ్వా.. ఈ ర‌త్తాలు సోకే వేరులే!  ఆ గెట‌ప్‌లో షాపులోకెళ్లి వ‌త్తుంటే త‌స్సాదియ్యా ఆ ఏరియా జ‌నం క‌ళ్లు చీక‌ట‌యిపోయాయి. ప‌ట్ట‌ప‌గ‌లే మ‌తిచెడి మంచ‌మెక్కారు. అంత ప్ర‌భావ‌వంత‌మైన ఈ అమ్మ‌డి వ్య‌వ‌హారం గురించి ముంబై మొత్తం హోరెత్తిపోతోంది. ఇంత‌కీ ఎవ‌రీ ర‌త్తాలు? అని అడిగేస్తారా?  అంత‌గా ఇంట్ర‌డ‌క్ష‌న్ అక్క‌ర్లేదేమో.. ది గ్రేట్ మ‌లైకా అరోరా ఖాన్.

వ‌య‌సు న‌ల‌భైకి చేరువైనా మ‌న‌సు మాత్రం ఇర‌వైలోనే ఆగిపోయింది. అందుకే ఇప్ప‌టికీ టీనేజీ కుర్రాళ్లు ఈ భామ ఫోటోల్ని మొబైల్ లో ఫోన్ డెస్క్‌ టాప్‌ పై అలంక‌రించుకుని మ‌రీ పూజిస్తున్నారు. ఈ వ‌య‌సులో ఆ రేంజు మెయింటెయిన్ చేయ‌డం అన్న‌ది కూడా ఓ క‌ళే!
Tags:    

Similar News