డైవర్స్ డబ్బుతో జల్సా?? పని చూస్కో

Update: 2017-08-03 17:58 GMT
ఇంటర్నెట్లో హీరోయిన్లు కాని నటీమణులు కాని ఏదైనా ఫోటోలు పెడితే చాలు.. మన జనాలకు ఉత్తినే ఏదో ఒకటి అనబుద్ది వేస్తుంది. ఆ మద్యన ఫాతిమా సనా షేక్ తన బికినీ ఫోటోలు పెడితే.. రంజాన్ మాసంలో ఈ చెత్తపని ఏంటని కామెంట్లు చేశారు నెటిజన్లు. అలాగే సన్ని లియోన్ తన అడాప్ట్ చేసుకున్న కూతురు ఫోటో పెట్టినా కూడా కఠోరంగానే స్పందించారు కుర్రకారు. ఇప్పుడు 40 ప్లస్ లో కూడా తన కత్తిలాంటి అందాలతో ఉడుకెత్తించే మలైకా అరోరా పైన కూడా అలాంటి కామెంట్లే చేస్తున్నారు.

రెగ్యలర్ గా సోషల్ మీడియాలో తన టూర్ల తాలూకు ఫోటులు పెడుతుంటుంది మలైకా. అయితే ఈ అమ్మడికి కేవలం మొగుడు అర్బాజ్ ఖాన్ తో విడిపోయాక వచ్చిన భరణం డబ్బుతోనే ఇలాంటి టూర్లు వేస్తోందని ఒకడికి కోపం వచ్చింది. వాడు వెంటనే ఆమె పోస్టులపై మొగుడు డబ్బులతో ఇలా తాగితందనాలు ఆడుతూ జల్సాగా తిరుగుతావా అంటూ కామెంట్ చేశాడు. దీనిపై స్పందించిన మలైకా.. ''నిజానిజాలు తెలుసుకోకుండా నోటికి వచ్చినట్లు వాగొద్దు. నీకు బొత్తిగా పనేం లేనట్లు ఉంది. ఏదన్నా పని చూస్కో'' అంటూ కామెంట్ చేసింది. డైవర్స్ తీసుకున్న తరువాత డబ్బులు రావడం కాదుకాని.. అసలు మలైకాకు అంతేసి ఆదాయం ఎక్కడిదో తెలుసా?

మలైకా.. బిపాసా బసు అలాగే హృతిక్ రోషన్ మాజీ భార్య సుజానే కలసి ఒక డిజైనర్ వేర్ కంపెనీ నడుపుతున్నారు. అలాగే గౌరీ ఖాన్ చేసే కొన్ని వ్యాపారాల్లో కూడా మలైకా పార్టనర్. తను పాటలు చేసినప్పుడు కూడా కోటికి తక్కువేం తీసుకోదు. అవన్నీ ఉంటే ఏ దేశానికైనా టూర్ వెళ్ళడం ఎంతసేపులే. కాబట్టి భరణం డబ్బులతో డైవర్స్ కారణంగా వచ్చిన మనీతో ఇలా టూర్లు వేస్తుందనడం ముమ్మాటికే తప్పే!!
Tags:    

Similar News