ఫోటో స్టోరిః 40ల‌లోనూ మైకం ర‌గిలిస్తోంది

Update: 2015-09-04 01:39 GMT
కెవ్వు కేక అంటూ కేక పుట్టించింది మ‌లైకా అరోరాఖాన్‌. 40కి నాలుగేళ్లే త‌క్కువ అప్పుడు. కానీ ఇప్పుడు నాలుగు ప‌దులు పూర్త‌య్యాయి. అయినా అస‌లు ఆ అందంలో కించిత్ భంగం కూడా క‌లిగిన‌ట్టే లేదు. అవే దేహ‌శిరులు, అదే సౌంద‌ర్యం.. సోగ‌లాంటి దేహాన్ని మెయింటెయిన్ చేయ‌డానికి, మేని శిరుల్ని కాపాడుకోవ‌డానికి ఏం చేస్తుందో తెలీదు కానీ మ‌గువ‌లంద‌రికీ ఆద‌ర్శంగా నిలుస్తోంది.

ఛ‌య్య ఛ‌య్య ఛ‌య్యా ఛ‌య్యా అంటూ ప‌దిహేనేళ్ల క్రిత‌మే దిల్‌ సే చిత్రంలో అదిరిపోయే స్టెప్పులేసింది. ప‌రుగెత్తికెళ్లే రైలు టాప్ మీద పొగ‌లు రేపే డ్యాన్సింగ్ స్ట‌యిల్‌తో ఆక‌ట్టుకుంది. ఆ త‌ర్వాత మ‌లైకానా మ‌ని తెలుగు యూత్ మ‌ర్చిపోలేక‌పోయారు. మ‌ళ్లీ మొన్న‌టికి మొన్న కెవ్వు కేక‌తో కేక‌లు పెట్టించింది. 40 వ‌య‌సులోనూ ఫోటోషూట్‌ల‌ తో విరుచుకుప‌డుతూ మ‌న‌సు దోస్తోంది. బ్ల‌క్ క‌ల‌ర్ లెద‌ర్ ఇన్‌వేర్‌, ఆ పైన ప‌లుచ‌టి నూలు పోగు సెగ‌లు పుట్టించ‌డం లేదూ? ఆర్భాజ్‌ ఖాన్ ఆ సెగల‌కు ప‌డిపోయే అమ్మ‌డిని మ‌నువాడేశాడు.

అయినా మ‌లైకా ఈ రేంజులో రెచ్చిపోయి ఫోటో షూట్ చేసిందంటే ఓ సందేహం వ‌స్తోంది. అప్ప‌ట్లో గ‌బ్బ‌ర్‌సింగ్ కోసం అలా వ‌చ్చి కేక పెట్టించా. ఇప్పుడు స‌ర్ధార్ గ‌బ్బ‌ర్‌సింగ్ కోసం ఇంకోసారి రెడీగా ఉన్నా. చూస్కో నా ప‌వ‌నూ.. నేనున్నా నీకోసం.. ఐటెమ్‌తో గ‌డ‌గ‌డ‌లాడిస్తా.. అని సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టే ఉంది క‌దూ?
Tags:    

Similar News