యోగా భంగిమ‌ల‌తో బౌన్స‌ర్ వేసి కోట్లు కొల్ల‌గొట్టేస్తోంది

Update: 2020-12-07 12:21 GMT
పర్ఫెక్ట్ లెంగ్త్ తో కుర్రకారు గుండెల్లోకి గూగ్లీలు బౌన్స‌ర్లు వేయాలంటే మ‌లైకా త‌ర్వాత‌నే. ఈ అమ్మ‌డు అలా ఆరుబ‌య‌ట క‌నిపిస్తే చాలు అక్క‌డ గుంపులుగా జ‌నం పోగ‌వుతున్నారు. త‌న‌నే క‌ళ్ల‌ప్ప‌గించి చూసేంత‌గా సెంట‌రాఫ్ అట్రాక్ష‌న్ గా నిలుస్తోంది.

నిరంత‌రం టైట్ స్పోర్ట్ డ్రెస్ ల‌తో దుమారం రేపుతోంది మ‌లైకా. బికినీ బీచ్ సెల‌బ్రేష‌న్ కి వెళ్లినా జిమ్ కి వెళ్లినా.. లేదా యోగా మ్యాట్ తో యోగా క్లాసుల‌కు వెళ్లినా ఇక క‌ళ్ల‌న్నీ త‌న‌వైపే. ఆ హాట్ నెస్ నెవ్వ‌ర్ బిఫోర్ అంటూ కితాబిచ్చేస్తూ ఇన్ స్టా ఫోటోల్ని జోరుగా వైర‌ల్ చేస్తోంది యూత్. 47ఏళ్ల వ‌య‌సులో ఈ అమ్మ‌డి అంద‌చందాలు నిరంత‌రం హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఇప్ప‌టికింకా నా వ‌య‌సు నిండా ప‌ద‌హారే! అన్నంత‌గా చెల‌రేగుతోంది మ‌లైక.

మలైకా అరోరా తన వ్యాయామ సెషన్ త‌ర్వాత యోగా పూర్తి చేశాక‌ పోస్ట్ చేసే ఫోటోల‌తో కోట్లాది రూపాయ‌ల బిజినెస్ సాగుతోందంటే న‌మ్మ‌గ‌ల‌రా? ఈ ఫోటోల‌తోనే మ‌లైకాకు క్రేజు పెరుగుతోంది. త‌న‌తో బ్రాండ్ ప‌బ్లిసిటీ కోసం కంపెనీలు ఎగ‌బ‌డి అడ్వాన్సులిస్తున్నాయ‌ట‌. అలా ఇప్ప‌టికే ఇన్ స్టా వేదిక‌గా బోలెడ‌న్ని క‌మ‌ర్షియ‌ల్ ప్ర‌క‌ట‌న‌లు పోస్ట్ చేసి ఆర్జించింది. మ‌రోవైపు టీవీ రియాలిటీ షోల్లోనూ మ‌లైకా క్రేజీగా ఆఫ‌ర్లు అందుకుంటోంది. ముఖ్యంగా ఛ‌య్య ఛ‌య్యా గాళ్ గా త‌న‌కి ఉన్న క్రేజు తో డ్యాన్స్ రియాలిటీ షోల జ‌డ్జిగానూ కొన‌సాగుతోంది.

లేటెస్టుగా మ‌లైకా యోగా సెష‌న్ ముగించి మ్యాట్ ని చేత‌ప‌ట్టి వెళుతున్న‌ప్ప‌టి ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి. నెవ్వ‌ర్ బిఫోర్ హాట్ లుక్ తో మ‌లైక మ‌త్త చ‌ల్లుతోంది.


For more Photos Click Here
Tags:    

Similar News