#2020లాస్ట్ పిక్‌: మార్వ‌ల‌స్ లుకింగ్ బేబి మలైకా

Update: 2020-12-31 17:30 GMT
2020 ఆద్యంతం అంత‌ర్జాలంలో ట్రెండీ స్టార్ గా పాపుల‌రైంది మ‌లైకా అరోరా. హ‌బ్బీ అర్జున్ క‌పూర్ తో నిరంత‌రం షికార్లు చేస్తూ మ‌లైకా విమానాశ్ర‌యాలు రెస్టారెంట్ విజిట్స్ లో కెమెరా కంటికి చిక్కింది. అనునిత్యం జిమ్ కి వెళుతు హాటెస్ట్ అవ‌తార్ లో క‌నిపించింది. యోగా జిమ్ మెడిటేష‌న్ అంటూ ప్ర‌తిసారీ ఏదో ఒక హాట్ వీడియోని ఫోటోని షేర్ చేస్తూ మ‌లైకా ఇచ్చిన ట్రీట్ ని అభిమానులు అంత తేలిగ్గా మ‌ర్చిపోలేరు.

``కిస్ ఎన్ క‌డ‌ల్స్ .. అన్ కండిష‌న‌ల్ ల‌వ్.. యాక్షిల్.. లాస్ట్ డే ఆఫ్ ది ఇయ‌ర్.. మేక్ ఇట్ కౌంట్`` అంటూ అదిరిపోయే ఫోటోని షేర్ చేసింది మ‌లైకా. చూసారుగా ఎంతో క్యూట్ గా ఉన్న‌ అంద‌మైన ప‌ప్పీని ముద్దాడేస్తూ గోముగా ప్రేమ‌గా క‌నిపిస్తోంది మ‌లైకం.

గ‌త రెండు మూడు రోజులుగా త‌న సోద‌రి అమృత అరోరా గోవా ఇంట్లో మ‌లైకా తిష్ఠ వేసింది. అక్క‌డే బోయ్ ఫ్రెండ్ అర్జున్ క‌పూర్ తో క‌లిసి ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది. ఇంత‌కుముందు బోయ్ ఫ్రెండ్ తో పాటు ఉన్న ఫోటోలు.. స్విమ్మింగ్ పూల్ ముందు యోగా ఫీట్స్ కి సంబంధించిన ఫోటోలు అంత‌ర్జాలాన్ని షేక్ చేశాయి. తాజాగా క్యూట్ క‌డ‌ల్ తో మురిపించే ఫోటోని మ‌లైకా షేర్ చేసింది. దీనికి మార్వ‌ల‌స్ లుకింగ్ బేబి అంటూ అభిమానులు హార్ట్ ఈమోజీల్ని షేర్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ ఫోటో వైర‌ల్ గా మారింది. ఇక 5 బీహెచ్ కే పోష్ విల్లాలో 31 రేతిరి జాత‌ర‌కు సంబంధించిన ట్రీట్ ఎలా ఉండ‌నుందో వేచి చూడాల్సిందే.
Tags:    

Similar News