అంద‌నంత ఎత్తులో ఉన్నా అందుకోవ‌డ‌మే నా స్టైల్

Update: 2020-12-31 02:30 GMT
స్త్రీని ఆకాశంలో స‌గం అని వ‌ర్ణిస్తారు క‌వులు. ఆకాశం అయినా అందాల‌‌న్న సి‌ద్ధాంతాన్ని చాలామంది మ‌హిళామ‌ణులు అనుసరిస్తున్నారు. ముఖ్యంగా పురుషాధిక్య‌త ఉండే రంగుల లోకంలో దేనికీ ఝ‌డ‌వ‌క ముందుకు సాగుతూ ధీశాలి అనిపించే అరుదైన నాయిక‌లు ఉన్నారు. అలాంటి కాన్ఫిడెంట్ గాళ్స్ ఎవ‌రున్నారు? అన్న‌ది వెతికితే అందులో తొలిగా ఛ‌య్య ఛ‌య్యా గాళ్ మ‌లైకా అరోరా పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తుంటుంది.

లైఫ్ లో ఏ నిమిషాన్ని విడిచిపెట్టేందుకు సిద్ధంగా ఉండ‌ని మ‌లైకా తాను ఏం చేయాల‌నుకుంటే అది చేసి చూపించార‌న్న‌ది స‌న్నిహితుల మాట‌. లైఫ్ లో ర‌సాస్వాధ‌న లేనిదే ఏదీ లేద‌ని నిరూపించిన నృత్య‌క‌ళాకారిణి తాను. న‌చ్చ‌ని వారికి దూరం జ‌రిగి న‌చ్చిన చెలికాడికి చేరువైన డేర్ త‌న‌కే సాధ్యమైంది.

ఇక ఆ త‌ర్వాత ఎంతో హ్యాపీ లైఫ్ ని ఆస్వాధిస్తూ నిరంత‌రం దానిని ప‌బ్లిక్ లోనే ఆవిష్క‌రిస్తూ త‌న వ‌ర్గంతో ఎంతో జాయ్ ఫుల్ గా లైఫ్ ని లీడ్ చేస్తూ మ‌లైకా త‌న గేమ్ ని తానే మార్చుకుంది. ప్ర‌స్తుతం సోద‌రి అమృత అరోరా గోవా 5 బీహెచ్ కే ఇంట్లో ప్రియుడు అర్జున్ క‌పూర్ తో క‌ల‌సి కొత్త సంవ‌త్స‌రం సెల‌బ్రేష‌న్స్ లో ఉంది మ‌లైకా. అక్క‌డ స్విమ్మింగ్ పూల్ చెంత యోగాభ్యాసం చేస్తూ అందుకు సంబంధించిన ఫోటోల్ని నిరంత‌రం షేర్ చేస్తోంది. ఇప్పుడు మ‌రో హాట్ ఫోటోని మ‌లైకా షేర్ చేసింది. అంత‌ర్జాలంలో సునామీ స్పీడ్ తో ఈ ఫోటో దూసుకుపోతోంది. అంద‌నంత ఎత్తులో ఉన్నా అందుకోవ‌డ‌మే నా స్టైల్ అని లోకానికి చెబుతున్న‌ట్టే ఉంది క‌దూ?
Tags:    

Similar News