ఒక్క డ్రెస్ ఖరీదు 1 లక్షా 60 వేలా

Update: 2018-03-10 07:24 GMT
సెలెబ్రిటీలు అంతే. వాడే కార్లు మొదలుకొని వేసుకునే దుస్తుల దాకా రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్న రీతిలో చేస్తుంటారు. అర్బాజ్ ఖాన్ మాజీ భార్య మలైకా అరోరా వరస కూడా ఇదే తీరులో ఉంది. తను ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్న డ్రెస్ లో మురిసిపోతున్న మలైకా తన ఆనందం కోసం ఎంతైనా ఖర్చు పెడతాను అంటోంది. ఎందుకంటే ఇక్కడ తను వేసుకున్న కాస్ట్యూమ్ ఖరీదు సుమారు 18 వందల డాలర్లు. మన కరెన్సీలో చూసుకుంటే 1 లక్షా 60 వేల పైమాటే. ఇంత డబ్బుతో ఓ చిన్న మధ్యతరగతి ఫ్యామిలీ ఓ పాతికేళ్ళు డ్రెస్సులు కొనుకోవచ్చు అనిపిస్తోంది కదూ. నిజమే కాని మనలా ఆలోచిస్తే వాళ్ళు ఫిలిం స్టార్స్ ఎందుకు అవుతారు. ముత్యాలు పొదిగి రెడ్ అండ్ నేవీ కలర్స్ మిక్స్ చేసి స్టైలిష్ గా కుట్టిన ఈ గౌన్ లో తనను చూస్తే 45 ఏళ్ళ వయసు అంటే నమ్మడం కష్టమే.

సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ తో ఈ మధ్యే విడాకులు తీసుకుని తెగతెంపులు చేసుకున్న మలైకా అరోరా పిల్లలు పెద్దయ్యాక ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల అందరు ఆశ్చర్యపోయారు. కాని పైకైతే విడాకులు తీసుకున్నారు కాని సందర్భం వచ్చినప్పుడంతా ఇద్దరు ఒకరి మీద ఒకరు ప్రేమ చాటుకుంటునే ఉన్నారు. ఆ మధ్య నేహా ధూపియా షోలో ఇది బయట పడింది కూడా. తిరిగి కలుసుకుని కొత్త జీవితం ప్రారంభిస్తారని ఇప్పటికే బాలీవుడ్ మీడియాలో చాలా కథనాలు వచ్చాయి. అర్బాజ్ ఖాన్ నిర్మాతగా సల్మాన్ హీరోగా దబాంగ్ 3 నిర్మించే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. దీని ఫస్ట్ పార్ట్ రీమేక్ గబ్బర్ సింగ్ లో మలైకా అరోరా కెవ్వు కేక సాంగ్ లో పవన్ పక్కన చిందులు వేసింది. సినిమాలు పూర్తిగా తగ్గించేసిన మలైకా అరోరా ప్రస్తుతం మోడలింగ్ పైనే దృష్టి పెడుతోంది.
Tags:    

Similar News