కొకైన్ - ఎపిడ్రిన్ - బ్రౌన్ సుగర్ - ఎండీఎంఏ .. పేరు ఏదైనా ఇవన్నీ మాదక ద్రవ్యాల జాతి. ఈ డ్రగ్ వాడకంతో యువతరం మత్తుగా చిత్తుగా జీవితాల్ని నాశనం చేసుకుంటున్న వైనం బయటపడుతోంది. 2017లో టాలీవుడ్ లో అతి పెద్ద డ్రగ్ స్కాండల్ డొంక కదిలిన సంగతి తెలిసిందే. కలెక్టర్ అకున్ సబర్వాల్ సారథ్యంలోని సిట్ బృందం టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారం గుట్టు రట్టు చేశారు. ఆ క్రమంలోనే పలువురు స్టార్లు, దర్శకుల పేర్లు బయటికి వచ్చాయి. అయితే ఆ తర్వాత ఆ వ్యవహారం సద్ధుమణిగిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా టాలీవుడ్ స్థబ్ధుగానే ఉంది.
ఇదే నేపథ్యంలో.. తాజాగా డ్రగ్స్ వ్యవహారంలో ఓ మలయాళ యువ కథానాయిక అరెస్టవ్వడం సంచలనమైంది. మలయాళ టీవీ - సినీ నటి అశ్వతి బాబును ఆదివారం నాడు తిరకక్కర (కేరళ) పోలీసులు అరెస్టు చేశారు. అశ్వతి తన కార్ డ్రైవర్ తో కలిసి ప్రమాదకర ఎండిఎంఏ డ్రగ్ ని కస్టమర్ కి అందించేందుకు వేచి చూస్తున్నారట. అందుకోసం అశ్వతి తన ఇంటి పరిసరాల్లో అటూ ఇటూ టచ్చాడుతున్నారట. దీనిపై మఫ్టీలో ఉన్న పోలీసులు తెలివిగా వల పన్ని అరెస్టు చేశారట. ప్రస్తుతం సదరు కథానాయికను కేసు విషయమై లోతుగా విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ డ్రగ్ దందాలో ఇంకా ఎవరెవరి పేర్లు బయటపడనున్నాయో అంటూ ప్రస్తుతం మల్లూవుడ్ లో ఆసక్తికర చర్చ సాగుతోంది.
హీరోయిన్ అశ్వతి తిరువనంత పురం నుంచి వచ్చి మాలీవుడ్ లో స్థిరపడ్డారు. ఈ డ్రగ్స్ వ్యవహారానికి క్లీన్ సిటీ బెంగళూరుతోనూ సంబంధం ఉందని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం పట్టుబడిన ఎండీఎంఏ డ్రగ్ సుదీర్ఘ సమయం మూడ్‌ని ఒకేలా ఉంచే డ్రగ్. డోసు పెరిగే కొద్దీ.. మనిషి మెదడుపై ఎక్కువ సమయం ప్రభావితం చూపిస్తుందట.