తెలుగు స్టార్ హీరోలు ఏడాదికి ఒకటి రెండు సినిమాలు చేయడమే గగనంగా మారింది. మహేష్ బాబు.. ఎన్టీఆర్.. పవన్ ఇంకా ఇతర హీరోలు ఏడాదికి ఒకటి కూడా విడుదల చేయలేక పోతున్నారు. కొందరు హీరోలు మాత్రం ఏడాదికి రెండు మూడు సినిమాలను విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఒక్కరు ఇద్దరు మూడు నాలుగు సినిమాలు అంతకు మించి చేస్తూ ఉన్నారు. కాని మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ మాత్రం చాలా స్పెషల్ అనిపించుకుంటున్నాడు.
మలయాళంలో ఆయన ఒక స్టార్ హీరో. ఆయన అత్యధిక పారితోషికం తీసుకుంటున్న మలయాళ హీరో ల జాబితాలో ముందు వరుసలో ఉంటాడు. అంతటి స్టార్ డమ్ ఉన్న హీరో పృథ్వీరాజ్ సోలో హీరోగా కంటే కంటెంట్ బేస్డ్ హీరోగా ఎక్కువ సినిమాలు చేస్తూ ఉంటాడు. ఆయన స్థాయిని పక్కన పెట్టి వరుసగా చిన్న సినిమాల్లో.. ఇతర హీరోల సినిమాల్లో నటించడం కేవలం పృథ్వీరాజ్ కే చెల్లింది.
అయిదు కాదు పది కాదు ప్రస్తుతం ఆయన చేతిలో ఏకంగా 20 సినిమాలు ఉన్నాయి. ఇటీవలే జనగణమన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హీరో దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించాడు. పాన్ ఇండియా స్టార్ గా ఇప్పటికే గుర్తింపు దక్కించుకున్న ఈ హీరో తెలుగు లో కూడా నటించేందుకు ఓకే చెప్పాడు అంటూ ఆ మధ్య వార్తలు వచ్చాయి.
తన ప్రతి సినిమాకు కూడా 20 నుండి 30 కాల్షీట్లు మాత్రమే ఇస్తూ ఏడాదిలో అత్యధిక సినిమాలు చేస్తున్న నటుడిగా పేరు దక్కించుకున్నాడు. కరోనా సమయంలో ఈయన నటించిన సినిమాలు ఓటీటీ ద్వారా కూడా విడుదల అయ్యి అభిమానులను ఎంటర్ టైన్ చేశాయి. నటుడిగా ఎన్నో అవార్డులను మరియు రివార్డులను కూడా దక్కించుకున్న పృథ్వీరాజ్ నటుల్లో ప్రత్యేకమైన నటుడు అని నిరూపించుకున్నాడు.
ఈయన కేవలం నటిస్తాడు అనుకుంటే పొరపాటే.. దర్శకుడిగా.. నిర్మాతగా కూడా సినిమాలు చేస్తూ ఉంటాడు. దర్శకుడిగా మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ తో చేసిన ఘనత కూడా ఉంది. అసలు ఇన్ని సినిమాలు నటుడిగా.. దర్శకుడిగా.. నిర్మాతగా ఇన్ని భాషల్లో సినిమాల్లో కనిపించడం ఎలా సాధ్యం అవుతుందని ఆయన తోటి నటీ నటులు జుట్టు పీక్కుంటూ ఉన్నారట. అందుకే స్టార్స్ ల్లో మా పృథ్వీరాజ్ సుకుమారన్ చాలా స్పెషల్ అంటూ మలయాళ ప్రేక్షకులు అంటూ ఉంటారు.