చిత్రం : ‘మళ్ళీ రావా’
నటీనటులు: సుమంత్ - ఆకాంక్ష సింగ్ - అభినవ్ - మిర్చి కిరణ్ - అప్పాజీ అంబరీష్ - అన్నపూర్ణ - సాత్విక్ - ప్రీతి అశ్రాని తదితరులు
సంగీతం: శ్రవణ్ భరద్వాజ్
ఛాయాగ్రహణం: సతీష్ ముత్యాల
నిర్మాత: రాహుల్ యాదవ్ నక్కా
రచన - దర్శకత్వం: గౌతమ్ తిన్ననూరి
రెండు దశాబ్దాల సినీ కెరీర్లో ‘సత్యం’.. ‘గోదావరి’ లాంటి రెండు మూడు సినిమాల్ని మినహాయిస్తే సుమంత్ కు చాలా వరకు చేదు అనుభవాలే ఎదురయ్యాయి. కొన్నేళ్లుగా ఆచి తూచి సినిమాలు చేస్తున్న సుమంత్ కు సరైన విజయం దక్కలేదు. ఇప్పుడతను ‘మళ్ళీ రావా’ అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చాడు. మరి ఈ చిత్రమైనా సుమంత్ ఆశించిన విజయాన్నందించేలా ఉందో లేదో చూద్దాం పదండి.
కథ:
కార్తీక్ (సుమంత్) స్కూల్లో చదివే రోజుల్లో అంజలి (ఆకాంక్ష) అనే అమ్మాయి కొత్తగా అతడి స్కూల్లో చేరుతుంది. ఇద్దరి మధ్య స్నేహం మొదలై అది ప్రేమగా మారుతుంది. అదే సమయంలో అనుకోకుండా అంజలి కార్తీక్ కు దూరమవుతుంది. ఆ తర్వాత కొన్నేళ్లకు కార్తీక్ ఉద్యోగం చేస్తున్న చోటికే అంజలి వస్తుంది. అక్కడ మళ్లీ వీళ్లిద్దరూ దగ్గరవుతారు. కానీ అంజలి మళ్లీ అతడిని విడిచి వెళ్లిపోతుంది. కొన్నేళ్లకు అంజలి మళ్లీ కార్తీక్ దగ్గరికి వస్తుంది. మరి ఈసారైనా వీళ్లిద్దరూ ఒక్కటయ్యారా లేదా అన్నది కథ.
కథనం - విశ్లేషణ:
‘మళ్ళీ రావా’.. ప్రేమ.. ఎడబాటు.. అందులోని బాధ నేపథ్యంలో సాగే స్వచ్ఛమైన లవ్ స్టోరీ. ఇందులో మంచి ఫీల్ ఉంది. ఈ కథను చెప్పడంలో ఒక పరిణతి కనిపిస్తుంది. ఇందులోని ఎమోషన్లు ప్రేక్షకులకు బాగానే కనెక్టవుతాయి. ప్రేమకథల్ని ఇష్టపడేవాళ్లు దీనికి బాగానే కనెక్టవుతారు. ఐతే మూడు దశలుగా సాగే ఈ కథలో వర్తమానం ఉన్నతంగా అనిపిస్తుంది. ప్రేక్షకుల్ని కదిలిస్తుంది. మిగతా రెండు దశల్ని చూపించిన తీరు మాత్రం ప్రేక్షకుల సహనానికి కొంతమేర పరీక్ష పెడుతుంది. చివర్లో మంచి ఫీల్ కలిగినప్పటికీ.. అక్కడి దాకా రావడానికి మాత్రం ప్రేక్షకులు కొంచెం ఓపిక చేసుకోవాలి.
ఒక కథను నేరుగా చెప్పుకుంటూ పోతే ప్రేక్షకులకు బోర్ కొట్టేస్తుందని.. అందులో కొత్తదనం ఏమీ కనిపించదని.. బ్యాక్ అండ్ ఫోర్త్ స్క్రీన్ ప్లే టెక్నిక్ ను ఫాలో అవుతుంటారు చాలామంది దర్శకులు. ఒకప్పుడు ఇది కొత్తగా అనిపించేది కానీ.. ఇప్పుడది పాతబడిపోయింది. ‘మళ్ళీ రావా’ సినిమా మొత్తం ఈ స్క్రీన్ ప్లేతోనే సాగుతుంది. ఐతే ఒక కథలో గతాన్ని.. వర్తమానాన్ని రెండు భాగాలుగా చేసి ఈ స్క్రీన్ ప్లేతో నడపడం మామూలే. కానీ ఇక్కడ మూడు దశల్ని ఈ తరహాలో చూపించాడు దర్శకుడు. దీన్ని దర్శకుడు కొత్తదనంగా భావించి ఉండొచ్చు కానీ ‘మళ్ళీ రావా’కు అదేమంత ప్లస్ కాలేదు. దీని వల్ల ప్రేక్షకులకు గందరగోళంగా అనిపించడమే కాదు.. ఫ్లో కూడా దెబ్బ తింది.
మూడు వేర్వేరు ఎపిసోడ్లను మార్చి మార్చి.. కట్ చేసి కట్ చేసి చూపిస్తుండటంతో ప్రేక్షకుడు ఎందులోనూ ఇన్వాల్వ్ కాని పరిస్థితి కనిపిస్తుంది. వర్తమానంలో బామ్మ ప్రస్తావన రాగానే ఫ్లాష్ బ్యాక్ లో బామ్మతో ముడిపడ్డ సన్నివేశంతో లింక్ చేయడం.. ఒక ఎపిసోడ్లోని ఒక డైలాగ్ దగ్గర కట్ చేసి.. అదే తరహా డైలాగుతో ఇంకో ఎపిసోడ్లోని సన్నివేశాన్ని మొదలుపెట్టడం.. ఇలా దర్శకుడు స్క్రీన్ ప్లే విషయంలో పెట్టిన శ్రద్ధ అది కనిపిస్తుంటుంది కానీ.. మూడు ఎపిసోడ్లను మార్చి మార్చి చూడటం వల్ల ఏదీ ఒక ఫ్లోతో సాగదు.
ఇక హీరో హీరోయిన్ల స్కూల్ డేస్.. వాళ్ల పరిచయం.. ప్రేమ నేపథ్యంలో సాగే సన్నివేశాల్లో ఏమంత విశేషం లేదు. మరీ అంత చిన్న వయసులో ప్రేమ అంటేనే ఏదో ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. ఇక దాన్ని ఎలా ఫీలవుతాం? ఈ ఎపిసోడ్ ను అవసరానికి మించి సాగదీశారు. హీరో హీరోయిన్లు రెండోసారి కలిసే నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు మాత్రం రిలీఫ్ ఇస్తాయి. ఇక్కడ సాఫ్ట్ వేర్ ఆఫీస్ నేపథ్యంలో వచ్చే కామెడీ సీన్స్ బాగానే నవ్విస్తాయి. ఇక్కడ కూడా లవ్ స్టోరీలో ఏమంత విశేషం లేకపోయినా.. ఇద్దరూ కలిసే నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు బాగానే పండాయి. హీరోయిన్ హీరోను వదిలి వెళ్లిపోవడానికి చూపించే కారణం అంత కన్విన్సింగ్ గా అనిపించదు.
ఇవన్నీ పక్కన పెట్టేస్తే ‘మళ్ళీ రావా’కు ప్రధాన ఆకర్షణగా నిలిచేది వర్తమానంలో సాగే చివరి అరగంట ఎపిసోడ్. ఎమోషనల్ గా టచ్ చేసేలా ఈ సన్నివేశాల్ని తీర్చిదిద్దాడు దర్శకుడు. భావోద్వేగాలు సరిగ్గా పండాయి ఇక్కడ. ముఖ్యంగా క్లైమాక్స్ కదిలిస్తుంది. ఇక్కడ దర్శకుడి పరిణతి కనిపిస్తుంది. ప్రధాన పాత్రధారులు కూడా చాలా బాగా నటించడంతో.. ఈ సన్నివేశాలు కదిలిస్తాయి. ఒక మంచి ఫీల్ తో.. ఎమోషన్ తో థియేటర్ నుంచి బయటికి వస్తాం. ఫీల్ గుడ్ లవ్ స్టోరీలు ఇష్టపడేవారికి ‘మళ్ళీ రావా’ కచ్చితంగా నచ్చుతుంది. నరేషన్ మరీ నెమ్మదిగా సాగడం సినిమాకు మైనస్. ఓవరాల్ గా సుమంత్ గత సినిమాలతో పోలిస్తే ‘మళ్ళీ రావా’ చాలా బెటర్ గా అనిపిస్తుంది.
నటీనటులు:
సుమంత్ చాన్నాళ్ల తర్వాత తనకు నప్పే సినిమాను ఎంచుకున్నాడు. సీరియస్ పాత్రలు చేయడంలో సుమంత్ ప్రత్యేకత మరోసారి కనిపిస్తుంది. గోదావరి.. మధుమాసం లాంటి సినిమాల్ని గుర్తు చేసేలా చక్కగా నటించాడతను. వినోదం పండించాల్సిన దగ్గర మామూలుగా అనిపించినా.. ఎమోషన్ సీన్లలో సుమంత్ పరిణతితో కూడిన నటనతో ఆకట్టుకున్నాడు. వర్తమానంలో సీరియస్ గా ఉండాల్సిన చోట.. సుమంత్ చాలా ఈజీగా చేసుకుపోయాడు. ముఖ్యంగా పతాక సన్నివేశంలో అతడి నటన ఆకట్టుకుంటుంది. హీరోయిన్ ఆకాంక్ష సింగ్ కూడా బాగా చేసింది. ఆమె చక్కగా హావభావాలు పలికించింది. చివరి అరగంటలో ఆకాంక్ష నటనా కౌశలం చూడొచ్చు. ఇక్కడ సుమంత్ కు దీటుగా నటించిందీ కొత్తమ్మాయి. మిగతా నటీనటుల్లో హీరో ఫ్రెండు.. అతడి ఆఫీసులో మేనేజర్ పాత్ర చేసిన వాళ్లు బాగా నటించారు. హీరోయిన్ తండ్రి పాత్ర చేసిన వ్యక్తి బాగా చేశాడు. అన్నపూర్ణ కూడా ఓకే. చిన్నప్పటి హీరో హీరోయిన్లుగా నటించిన అబ్బాయి.. అమ్మాయి కూడా బాగా చేశారు.
సాంకేతికవర్గం:
శ్రవణ్ భరద్వాజ్ సంగీతం సినిమాకు అది పెద్ద ప్లస్ పాయింట్లలో ఒకటి. పాటలు.. నేపథ్య సంగీతం ఆరంభం నుంచి చివరి దాకా ఒక ఫీల్ తో సాగుతాయి. ప్రతి సన్నివేశంలోనూ సంగీత దర్శకుడి ప్రతిభ కనిపిస్తుంటుంది. సన్నివేశాన్ని లేపడానికి.. ఫీల్ తీసుకురావడానికి మ్యూజిక్ డైరెక్టర్ గట్టి ప్రయత్నం చేశాడు. సినిమాకు ఆకర్షణగా నిలిచిన చివరి అరగంటలో నేపథ్య సంగీతం చాలా బాగుంది. సతీష్ ముత్యాల ఛాయాగ్రహణం కూడా బాగుంది. సుమంత్ గత సినిమా ‘నరుడా డోనరుడా’ మాదిరిక కాకుండా ప్రొడక్షన్ వాల్యూస్ మీద కూడా శ్రద్ధ పెట్టారు. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ప్రేమకథల్ని బాగా డీల్ చేయగలనని.. ఎమోషన్లు బాగా డీల్ చేయగలనని రుజువు చేసుకున్నాడు. అతడి నరేషన్ మాత్రం మరీ స్లో. స్క్రీన్ ప్లే డిఫరెంటుగా ట్రై చేసినప్పటికీ గందరగోళంగా అనిపిస్తుంది. గౌతమ్ మాటలు బాగున్నాయి. ఓవరాల్ గా అతను ఓకే అనిపించాడు.
చివరగా: మళ్ళీ రావా.. మనసులోకి ఎక్కుతుంది.. కానీ నెమ్మదిగా!
రేటింగ్- 2.75/5
Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre