త‌న‌ని తానే బంధించుకున్న మ‌ల్లిక‌

Update: 2018-05-15 11:13 GMT
ఒక‌ప్పుడు బాలీవుడ్ ఐటం బాంబ్ మ‌ల్లికా షెరావ‌త్. చిట్టి పొట్టి డ్రెస్సులో హాట్ ఎక్స్ పోజింగ్‌తో సెగ‌లు పుట్టించేది. ఇప్పుడు మాత్రం బాలీవుడ్ సినిమాల‌కు దూరంగా ప్రియుడితో సెటిలైపోయింది. అవ‌కాశం దొరికిన‌ప్పుడ‌ల్లా సామాజిక చైత‌న్యం తెచ్చే కార్య‌క్ర‌మాల్లో భాగ‌స్వామి అవుతూ ఉంటుంది. తాజాగా ఫ్రాన్స్ లో జ‌రుగుతున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌ లో ఆమె పాల్గొంది. ఆ కార్య‌క్ర‌మంలో పెద్ద బోనులో త‌న‌ను తాను బంధించుంది. దీంతో వార్త‌ల్లో వ్య‌క్తిగా మారింది. మ‌ల్లిక ఎందుకిలా చేసింది?

ప్ర‌పంచంలో ఎంతో మంది అమ్మాయిలు అప‌హ‌ర‌ణ‌కు గుర‌వ‌తున్నారు. వారిని బ‌లవంతంగా వేశ్యా వృత్తిలోకి దించుతున్నారు. ఈ అమ్మాయిల‌ను  క‌నీసం గాలి కూడా స‌రిగా ఆడ‌ని చిన్న గ‌దుల్లో ఉంచుతున్నారు. ఈ హ్యూమ‌న్ ట్రాఫికింగ్‌కు వ్య‌తిరేకంగా పోరాడుతున్న సంస్థ ఫ్రీ ఏ గ‌ర్ల్ ఎన్జీవో. ఆ సంస్థ‌కు అంబాసిడ‌ర్‌గా ఉంది మ‌ల్లికా. ఆ సంస్థ త‌ర‌పున కేన్స్ చిత్రోత్స‌వంలో ప్ర‌చారం చేప‌ట్టింది. త‌న‌ని తానే ఓ చిన్న బోనులో బంధించుకుని 12 గంట‌ల పాటూ ఉంది. అప‌హ‌ర‌ణ‌కు గురై న‌ర‌కం అనుభ‌విస్తున్న అమ్మాయిల‌ను కాపాడ‌మ‌ని హ్యూమ‌న్ ట్రాఫికింగ్ నిరోధించ‌మ‌నే ప్ర‌చారం ఆమె చేసిన ప‌నిలో దాగుంది. గ‌తేడాది కూడా ఇలా మ‌ల్లిక త‌న‌ను తాను బంధించుకుంది.

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌తి నిమిషానికో మ‌హిళ టార్చ‌ర్ అనుభ‌విస్తోంద‌ని అలాంటి వారిని కాపాడేందుకు త‌న వంతు కృషి చేస్తున్న‌ట్టు మ‌ల్లికా పేర్కొంది. హ్యూమ‌న్ ట్రాఫికింగ్ బ‌లైన ఆడ‌పిల్ల‌లు మ‌హిళ‌లు కేవ‌లం 12 అడుగుల పొడ‌వు 8 అడుగుల వెడ‌ల్పు ఉన్న చిన్న గ‌దుల్లో మ‌గ్గుతున్నార‌ని అక్క‌డే రోగాల బారిన ప‌డి నీర‌సించి పోతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది. ఆ గ‌దుల్లో ఉన్న వారి పరిస్థితి ఎంత అధ్వానంగా ఉంటుందో చెప్ప‌డం కోసం త‌న‌ను తాను చిన్న బోనులో లాక్ చేసుకున్న‌ట్టు చెప్పింది. అలాగే మ‌ల్లికా ఉర్జా అనే స్వ‌చ్ఛంద సంస్థ త‌ర‌పున కూడా ప‌నిచేస్తోంది. ఆ సంస్థ ప్ర‌తినిధిగా మ‌హిళా స‌మ‌స్య‌ల‌పై పోరాడింది కూడా.


Tags:    

Similar News