ఇటీవల రకరకాల టాపిక్ లు అంతర్జాలాన్ని వేడెక్కిస్తున్నాయి. అందులో మీటూ అత్యాచారాలు అనేవి నిరంతరం హాట్ టాపిక్. మహిళలపై పెరుగుతున్న లైంగిక హింసకు మీ సినిమాలు కారణమని ట్విట్టర్ యూజర్ ఒకరు అందాల కథానాయిక మల్లికా షెరావత్ ని సోషల్ మీడియాల్లో విమర్శించారు. అయితే అతడి విమర్శల్ని మల్లిక తాజాగా తిప్పికొట్టారు. ప్రజల్లో ఇలాంటి మనస్తత్వాన్ని మార్చాల్సిన అవసరం ఉందని మల్లిక సీరియస్ అయ్యారు.
హత్రాస్ అత్యాచారం కేసు గురించి మల్లికా ట్వీట్ చేస్తూ, “భారతదేశం సంస్కరణలు చేయకపోతే అది మహిళల పట్ల మధ్యయుగం నాటి మనస్తత్వం ఏమీ మారదు # హత్రాస్ హర్రర్ # నిర్భయకేస్” అన్నారు. అయితే ఆమె ట్వీట్‌కు సమాధానమిస్తూ.. ట్విట్టర్ యూజర్ ఇలా రాశారు. “అయితే మీరు బాలీవుడ్ సినిమాలో ఎలాంటి పాత్రలు పోషించారో చూస్తే మీ స్టేట్ మెంట్ కు పూర్తి విరుద్ధంగా ఉంటాయి. మీ చలన చిత్రాల ద్వారా మీరు అందించే సందేశం కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ముందుగా ప్రకటన చేస్తున్న వ్యక్తి నుండి అభివృద్ధి ప్రారంభం కావాలి” అంటూ కౌంటర్ వేశారు.
దానికి మల్లికా బదులిస్తూ, “కాబట్టి నేను నటించే సినిమాల వల్లనే అత్యాచారానికి ఆహ్వానం !!! మీలాంటి మనస్తత్వం భారతీయ సమాజాన్ని అలాగే ఇక్కడ నివశించే మహిళలను తిరోగమనంలో నడిపిస్తుంది! మీరు నా సినిమాలతో సమస్య ఉంటే వాటిని చూడకండి ” అని అన్నారు.
ఖ్వాహిష్ వంటి బోల్డ్ చిత్రాలలో మల్లిక హద్దుమీరిన ఎక్స్ పోజింగ్ పై ఇంతకుముందు విమర్శలొచ్చాయి. 2018 లో మల్లికా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన సహ-నటులతో సన్నిహితంగా ఉండటానికి నిరాకరించడంతో తాను ఎన్నో చిత్రాలను కోల్పోవలసి వచ్చిందని వెల్లడించారు. ``నాపై చాలా ఆరోపణలు ... తీర్పులు ఉన్నాయి. మీరు పొట్టి స్కర్టులు ధరిస్తే కుదరదు. తెరపై ముద్దు పెట్టుకున్నా.. నీతి పద్ధతి లేని స్త్రీ అయినట్టు`` అని విమర్శలొచ్చాయట. మీ క్యారెక్టర్ వల్లనే పురుషులు మీతో స్వేచ్ఛను కోరుకుంటారు. ఇలాంటిది నాతో కూడా జరిగింది అని ఆ ఇంటర్వ్యూలో మల్లిక తెలిపింది. మొత్తానికి సనాతన విధానాల్లోనే ఉండిపోయిన భారతీయ పురుషుల్ని మల్లిక ఓ రేంజులోనే తిట్టేసింది మరి.