ఈ వకీల్ బ్యూటీ ఘాటు అందాలకు ఫిదా అవ్వాల్సిందే..!

Update: 2021-04-15 04:30 GMT
టాలీవుడ్ కుర్రహీరోయిన్ మాళవిక శర్మ అంటే గ్లామర్ ప్రియులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఈ తరం కుర్రకారు మాళవిక అంటే మనసు పారేసుకుంటున్నారు. ఇరవైఏళ్లకే హీరోయిన్ గా టాలీవుడ్ అరంగేట్రం చేసిన మాళవిక.. తొలి సినిమాతోనే కుర్రాళ్లను తన బుట్టలో వేసుకుంది. ముంబైలో పుట్టి పెరిగిన ఈ కుర్రది.. మాస్ మహారాజ్ రవితేజ సరసన నేలటికెట్టు సినిమాతో వెండితెర పై అడుగుపెట్టింది. తొలి సినిమాలోనే అమ్మడు నిర్మొహమాటంగా లేత అందాలన్నీ ఆరబోసి మంచి క్రేజ్ దక్కించుకుంది. కాలేజీ టైంలోనే మోడలింగ్ ప్రారంభించి పలు ఫేమస్ కమర్షియల్ టీవీ యాడ్స్ లో మెరిసింది. ఆ యాడ్స్ ద్వారానే మాళవిక తన ఫస్ట్ సినిమా ఛాన్స్ కొట్టేసింది.

అయితే అమ్మడికి ఎంత అందం ఉన్నప్పటికి సినిమాలపరంగా ఇంకా ఫస్ట్ సాలిడ్ హిట్ పడలేదు. ఇప్పటివరకు చేసింది రెండు సినిమాలే. సినిమాలు హిట్టు కాలేదు కానీ మాళవిక అందాలకు ఫుల్ మార్కులే పడ్డాయి. ఈ కుర్రబ్యూటీకి ఇంస్టాగ్రామ్ లో 9లక్షలకు పైగా ఫాలోయర్స్ ఉన్నారు. అమ్మడు ఏ పోస్ట్ పెట్టినా ఇట్టే ఆ పోస్ట్ వైరల్ చేస్తుంటారు అభిమానులు. సోషల్ మీడియాలో మాళవిక యాక్టీవ్ గానే ఉంటుంది. వ్యక్తిగతంగా లాయర్ అవ్వాలని అనుకుని ఎల్.ఎల్.బి కూడా చదివింది. సినిమాలపరంగా ఖాళీ దొరికితే చాలు  ఘాటు ఫోటోషూట్లతో ఇంస్టాగ్రామ్ హీటెక్కిస్తుంది. తాజాగా మాళవిక మోస్ట్ హాట్ త్రోబ్యాక్ పిక్ పోస్ట్ చేసింది. ఖచ్చితంగా ఆ ఫోటోలో మాళవిక ఫిగర్ చూస్తే ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే. టాప్ టు బాటమ్ ముఖ్యంగా మాళవిక నడుం కుర్రాళ్లను మైకంలో పడేస్తుందని కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.
Tags:    

Similar News