‘సంజు’ సినిమాలో సంజయ్ దత్ పాత్రలో రణబీర్ కపూర్ ఎంత బాగా ఒదిగిపోయాడో చూశాం. అంతకంటే ముందు మహానటి సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ కూడా అద్భుత అభినయం ప్రదర్శించింది. పెద్దగా అనుభవం లేని వీళ్లే ఆయా పాత్రల్లో అంత బాగా నటిస్తే.. ఇక మూడు దశాబ్దాలకు పైగా నటనలో కొనసాగుతూ ఎన్నో అద్భుతమైన పాత్రల్ని పండించిన మమ్ముట్టి.. వైఎస్ పాత్రలో నటిస్తూ ఇంకెంత బలమైన ముద్ర వేయాలి? అందుకే ఆ పాత్ర కోసం మమ్ముట్టి ప్రాణం పెట్టి పని చేస్తున్నారట. ఈ విషయమై ‘యాత్ర’ దర్శకుడు మహి.వి.రాఘవ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. మమ్ముట్టి లాంటి గ్రేట్ ఆర్టిస్టుతో పని చేయడం తన అదృష్టమన్న మహి.. ఈ చిత్రంలో తాను మమ్ముట్టిని డైరెక్ట్ చేస్తున్నట్లు భావించడం లేదని అన్నాడు.
వైఎస్ పాత్రలో ఒదిగిపోవడం కోసం మమ్ముట్టి కొన్ని నెలల ముందు నుంచే సన్నాహాలు మొదలుపెట్టారని.. ప్రత్యేకంగా ఒక తెలుగు టీచర్ ను పెట్టుకుని డైలాగుల విషయంలో సాధన చేశారని.. తెలుగు డిక్షన్ పర్ఫెక్టుగా ఉండేలా చూసుకుంటున్నారని.. మలయాళంలో తెలుగు డైలాగులు రాసుకుని సాధన చేస్తున్నారని మహి చెప్పాడు. ఇక వైఎస్ లా మారేందుకు బాడీ లాంగ్వేజ్ తో పాటు బాడీని కూడా మార్చుకున్నారని చెప్పాడు. ఆయన అద్భుతమైన నటనను చూసే అవకాశం దక్కిందని.. వైఎస్ పాత్రను పండించడానికి ఆయన అన్ని రకాల ప్రయత్నాలూ చేస్తున్నారని మహి తెలిపాడు. వైఎస్ పుట్టిన రోజు సందర్భంగా ఆదివారమే ‘యాత్ర’ టీజర్ విడుదల కాబోతుండటం విశేషం. సెప్టెంబరుకల్లా సినిమాను పూర్తి చేసి ఈ ఏడాది చివర్లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తేవాలని భావిస్తున్నారు.