ఈ ఏజ్ లో ఆ హీరోతో స్టార్ హీరో భార్య ప్రేమకథ?

Update: 2022-10-20 01:30 GMT
జ్యోతిక.. ఎన్నో తమిళ, తెలుగు సినిమాల్లో మెరిసిన ఈ సీనియర్ హీరోయిన్ ఒకానొక సినిమాలో కలిసి కోస్టార్ హీరో సూర్యతో ప్రేమలో పడి పెళ్లి చేసుకొని పిల్లలకు తల్లి అయ్యి హౌస్ వైఫ్ గా మారింది. సిమ్రాన్ తర్వాత కొన్నేళ్ల పాటు ఆమెనే నంబర్ 1 హీరోయిన్ గా కొనసాగింది. తెలుగులోనూ చిరంజీవి, నాగార్జున లాంటి టాప్ స్టార్లతో ఆమె సినిమాలు చేసింది. కెరీర్ చివరి దశలో తమిళ స్టార్ హీరోసూర్యను పెళ్లి చేసుకొని గృహిణిగా మారాక సినిమాలు మానేసి భర్త పిల్లలను చూసుకుంది.

పిల్లలను చూసుకోవడం కోసం సినిమాలు మానేసిన జ్యోతిక.. తాజాగా మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ‘36 వయదినిలే’ అనే మంచి సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. మరికొన్ని క్యారెక్టెడ్ ఓరియెంటెడ్ చిత్రాల్లోనూ నటించింది. ఐతే రీఎంట్రీలో వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలే చేస్తూ వచ్చిన ఆమె ఇప్పుడో పెద్ద హీరో పక్కన కథనాయికగా నటిస్తోంది. ఆ హీరో ఎవరో కాదు మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి.

మమ్ముట్టితో జ్యోతిక నటించడం ఇదే తొలిసారి కావడం విశేషం.. ఆమె కెరీర్ లో పీక్స్ స్టేజీలో ఉండగా మమ్ముట్టి సినిమాలో హీరోయన్ గా నటించే అవకాశం ఉన్నా చేయలేదు. తాజాగా ఈ కాంబినేషన్ ఇప్పటికి సెట్ అయ్యింది.

వీరి కలయికలో తెరకెక్కుతున్న చిత్రానికి ‘కాదల్’ అనే టైటిల్ పెట్టారు. అంటే ప్రేమ అని అర్థం. ఫస్ట్ లుక్ కూడా లాంఛ్ అయ్యింది. ఒకనోస్టాల్జిక్ ఫీల్ కనిపిస్తోంది. బ్లాక్ అండ్ వైట్ లో ఉన్న ఫొటోలో మమ్ముట్టి-జ్యోతిక లను ప్రేమ జంటగా కనిపిస్తున్నారు. ఫస్ట్ లుక్ చూస్తేనే ఈ మూవీ ఒక ప్రేమ కావ్యంగా కనిపిస్తోంది. జియో బేబీ అనే దర్శకుడు తమిళ, మలయాళంలో రూపొందిస్తున్నారు.

పెళ్లి అయ్యి పిల్లలు అయ్యాక ఈ స్టేజీలో జ్యోతిక లవ్ స్టోరీలో నటించడం ఏంటని పలువురు కామెంట్ చేస్తున్నారు. ఈ జోడీ ఎలాంటి మ్యాజిక్ చేస్తుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News