బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ను హత్య చేస్తామంటూ ఒక వ్యక్తి ఫోన్ లో బెదిరించడం ప్రస్తుతం బాలీవుడ్ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. సల్మాన్ ఖాన్ మేనేజర్ మరియు తండ్రికి వచ్చిన ఫోన్ లో సల్మాన్ ను చంపేస్తానంటూ ఒక వ్యక్తి బెదిరించాడట. దాంతో పోలీసులకు సల్మాన్ మేనేజర్ ఫిర్యాదు చేశాడు. నెంబర్ ఆధారంగా ఫోన్ చేసిన వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. ఉత్తర ప్రదేశ్ కు చెందిన షారుఖ్ గులాంనబీగా గుర్తించారు. ఈ విషయమై పోలీసులు లోతుగా ఎంక్వౌరీ చేస్తున్నారు. షారుఖ్ గులాంనబీని పోలీసులు పలు కోణాల్లో విచారణ చేస్తున్నారు.
విచారణలో అతడు తాను సల్మాన్ కు అభిమానిని అని, అందుకే ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నించాను. సోషల్ మీడియా ద్వారా సల్మాన్ ఖాన్ మేనేజర్ నెంబర్ తీసుకున్న నేను పలు సార్లు సల్మాన్ నెంబర్ కావాలని కోరాను. కాని ఆయన మాత్రం సల్మాన్ నెంబర్ ఇచ్చేందుకు నో చెప్పాడు. సల్మాన్ తండ్రికి కూడా ఫోన్ చేసి నెంబర్ ఇవ్వమని కోరాను. కాని ఆయన కూడా సల్మాన్ నెంబర్ ఇచ్చేందుకు నిరాకరించాడు. దాంతో నేను వారిని బెదిరించాను. అంతే తప్ప తనకు సల్మాన్ ఖాన్ పై ఎలాంటి కోపం లేదని, ఇందులో ఎలాంటి కుట్ర లేదని చెబుతున్నాడు.
గులాంనబీ మూలల గురించి పోలీసులు లోతుగా ఎంక్వౌరీ చేసిన సమయంలో ఆయనకు చోటా షకీల్ తో సంబంధాలు ఉన్నట్లుగా వెళ్లడైంది. చోటా షకీల్, దావూద్ ఇబ్రహీంల మద్య సన్నిహిత్యం ఉన్న విషయం తెల్సిందే. అలా దావూద్ ఇబ్రహీం ఏమైనా సల్మాన్ ఖాన్ హత్యకు ప్రయత్నాలు చేస్తున్నాడా అనే అనుమానాలను కూడా పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. గులాంనబీ విషయంలో పోలీసులు చాలా సీరియస్ గా ఎంక్వౌరీ కొనసాగిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.