మంచు విష్ణు ఓ బృహత్తర ప్రాజెక్టును నెత్తికెత్తుకోబోతున్నాడు. నిర్మాతగా, హీరోగా అతడి కెరీర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమా తర్వలోనే పట్టాలెక్కబోతోంది. ఇది హనుమంతుడి జీవిత కథ ఆధారంగా తెరకెక్కబోయే సినిమా కావడం విశేషం. భారతీయ సినీ చరిత్రలోనే ప్రత్యేకంగా నిలిచిపోయేలా ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దడానికి సన్నాహాలు చేస్తున్నాడు విష్ణు. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విశేషాలు మీకోసం.
హనుమంతుడి పాత్రను ఇప్పటిదాకా చాలా పౌరాణిక సినిమాల్లో చూశాం. ఐతే పూర్తిగా హనుమంతుడి కథతో సినిమా రాలేదు. ఓ యానిమేషన్ సినిమా తీశారు కానీ.. ఫీచర్ ఫిలిం మాత్రం ఎవరూ చేయలేదు. ఇప్పుడు విష్ణు ఆ లోటు తీర్చాలనుకుంటున్నాడు. దీన్ని టాలీవుడ్ స్థాయిలో కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో తీయాలన్నది విష్ణు ఆలోచన. ఇంగ్లిష్, తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కే ఈ సినిమాను ఓ హాలీవుడ్ డైరెక్టర్ కు అప్పగించాలని చూస్తున్నాడు. తెలుగు, తమిళ భాషల వరకు ఓ కన్సల్టెంట్ డైరెక్టర్ ను నియమించుకుంటాడట.
అంతర్జాతీయ స్థాయి వీఎఫ్ ఎక్స్ టెక్నాలజీని ఈ సినిమా కోసం ఉపయోగిస్తారట. బడ్జెట్ కూడా భారీగా ఉంటుందని.. భాగస్వామ్యం కోసం హాలీవుడ్ నిర్మాణ సంస్థల్ని కూడా సంప్రదిస్తున్నాడని సమాచారం. హనుమంతుడు పుట్టినప్పటి నుంచి హిమాలయాలకు ధ్యానం కోసం వెళ్లే వరకు ఆయన జీవితంలోని అన్ని కోణాల్ని స్పృశించబోతున్నారీ సినిమాలో. విష్ణు ప్రయత్నాలు ఫలిస్తే ఈ సినిమా అతడి కెరీర్లో ప్రత్యేకంగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు.