మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పోటీ దారులైన మంచు విష్ణు-ప్రకాష్ రాజ్ ఫ్యానల్స్ మధ్య మాటల యుద్దం ముదురుతోంది. ఎన్నికలకు ఇంకా పది రోజులే సమయం ఉండటంతో సన్నివేశం రోజు రోజురి హీటెక్కుతోంది. రెండు ప్యానల్స్ ఇప్పటికే తమ మ్యానిఫెస్టోని ప్రకటించాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత తాము ఏమేమి చేస్తామో క్లియర్ చెబుతూ తమ ఎజెండాని సభ్యుల ముందుకు తీసుకెళ్తున్నారు. ఓటర్లని ఆకర్షించుకునే ప్రయత్నంలో భాగంగా ఎవరికి వారు బిజీ అయ్యారు. ఈ నేపథ్యంలో మంచు విష్ణు మద్దుదారుడు..మాజీ `మా` అధ్యక్షుడు వి. కె నరేష్ ..ప్రకాష్ రాజ్ ని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసారు.
తెలుగు సినిమా హీరోలు చేయాలనుకుంటే ఏదైనా చేస్తాం. అదీ చేయనిస్తే అని నొక్కి పలికారు. సంక్షేమ కార్యక్రమాలకి పెద్ద పీట వేస్తాం. విద్య..ఆరోగ్యంపై ప్రత్యేకంగా పనిచేస్తాం. మా టార్గెట్ వెల్ ఫేర్ అని క్లియర్ గా చెప్పాం. కానీ మీ ఎజెండా ఏంటన్నది చెప్పకుండా సభ్యుల్ని గందరోగాళానికి గురి చేస్తున్నారన్నారు. ప్రకాష్ రాజ్ గార్ని డైరెక్ట్ గా ఓ మాట అడుగుతున్నా. దీనికి మీరు సమాధానం చెప్పండి. ప్రకాష్ రాజు గారు మీరు ఎప్పుడైనా ఈ 25 ఏళ్లలో వచ్చి `మా`కు ఓటు వేసారా? ఎన్నోసార్లు జనరల్ బాడీ మీటింగ్ లు జరిగాయి. ఎప్పుడైనా ఏ సమావేశంలోనైనా పాల్గొన్నారా? మీరు సస్పెండ్ అయ్యారా? లేదా? ఎన్నిసార్లు సస్పెండ్ అయ్యారు అన్నది చెప్పాలి.
మెంబర్ల పుట్టిన రోజులకు ఎప్పుడైనా ఫోన్ చేసి విష్ చేసారా? ఎందుకు ఉన్నట్లుండి `మా` మీద ప్రేమ పుట్టుకొచ్చింది? మీకు మీరుగా వచ్చారా? లేక ఎవరైనా తెచ్చారా? మీరు కేవలం గ్రామాల్నే దత్తత తీసుకున్నారు? నేను ఏకంగా జిల్లానే దత్తత తీసుకున్నా? అందులో 60 మండలాలు ఉన్నాయి. ఇంత చేసాం..అంత చేసామని చెప్పుకునే వాళ్లు `మా`ని ఎందుకు దత్తత తీసుకోలేదు. `మా` లో ఒక్కమనిషినైనా దత్తత తీసుకున్నారా? మా అమ్మ నెలకి 15 వేలు `మాకి` ఇచ్చేది. ఏడాదికి ఒక మనిషిని దత్తత తీసుకునే వాళ్లం. మీరేంటి రెస్టారెంట్ లో డిస్కౌంట్లు..పబ్ ల్లో డిస్కోలు ఆడాలంటున్నారు? ఏంటో అర్ధం కాలేదని నరేష్ అసహనం వ్యక్తం చేసారు.