డైనమిక్ హీరో మంచు విష్ణు.. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తమ్ముడు సుధాకర్ రెడ్డి కుమార్తె విరానికా రెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. విష్ణు - విరానిక దంపతులకు నలుగురు పిల్లలు ఉన్నారు. ఇటీవల కమెడియన్ అలీ హోస్ట్ చేస్తున్న ఓ టాక్ షో ఎక్కువ మంది పిల్లలు ఉండటం గురించి విష్ణు మాట్లాడారు. 'నలుగురితో ఆపేస్తావా? దాన్ని అర డజన్ చేస్తావా?' అని అలీ ప్రశ్నించగా.. పిల్లలంటే తనకు బాగా ఇష్టమని.. అయితే పిల్లల విషయంలో ఏదీ ప్లాన్ చేసుకోలేదని విష్ణు తెలిపారు.
''పిల్లలంటే నాకు ఇష్టం. పది, పదిహేను మంది పిల్లలున్నా ఓకే. షూటింగ్ సమయంలో కూడా పిల్లలు ఎక్కడుంటే అక్కడికి వెళ్లిపోతా. పిల్లల విషయంలో మేం ఏదీ ప్లాన్ చేసుకోలేదు. నాకు కూతురు కావాలని ఉండేది. విన్నీ కి కొడుకు కావాలని ఉండేది. అలా జరిగిపోయాయంతే. ఆమె ప్రెగ్నెన్సీ సమయంలో నాకు ఆడవాళ్ల మీద మిలియన్ రెట్లు గౌరవం పెరిగింది. వాళ్ల చిటికెన వేలుకి కూడా మనం సరిపోము'' అని మంచు విష్ణు చెప్పారు. ఈ సందర్భంగా తనకు నలుగురు పిల్లలు ఉండటంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తో జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్ గురించి మంచు విష్ణు వెల్లడించారు.
''విన్నీ కుటుంబం ప్రతివారం కలుసుకుంటారు. నేను కూడా హాజరయ్యాను. అప్పటికే మాకు ముగ్గురు పిల్లలు. విన్నీ మళ్ళీ ప్రెగ్నెంట్ అని అందరికీ తెలిసిపోయింది. షర్మిలక్క కనిపించగానే 'మా విన్నీని ఇబ్బంది పెట్టడం ఆపెయ్' అని వెళ్లిపోయారు. ఆ తర్వాత జగన్ గారు 'విష్ణూ మా సిస్టర్ ని ఎందుకంత ఇబ్బంది పెడుతున్నావు. నలుగురు పిల్లలు చాలు' అంటూ కోప్పడ్డారు. అదొక ఫన్నీ ఇన్సిడెంట్. అందరూ అభినందనలు చెబుతూనే తిట్టడం మొదలెట్టేవారు'' అని మంచు విష్ణు చెప్పుకొచ్చారు. ఇంకా మాట్లాడుతూ.. విన్నీని మరో బిడ్డ కావాలా అని అడిగితే 'మరొకరిని చూసుకోపో' అని కసురుకుంది అని నవ్వుతూ అన్నాడు.